Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను ఎక్కడ ఫిక్స్ చేయాలో తెలుసు!
By: Tupaki Desk | 11 Dec 2017 10:53 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ - ఆయన కుటంబ సభ్యులపై స్పందించడంలో ముందుండే కొడంగల్ ఎమ్మెల్యే...ఇటీవలే టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి తన విమర్శలను కేసీఆర్ బంధువులపై కూడా ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ మామ నకిలీ ఎస్టీ సర్టిఫికేట్ తో ఉద్యోగం పొందారని రేవంత్ ఆరోపించడం..దానిపై టీఆర్ ఎస్ నేతలు స్పందించడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై తాజాగా మళ్లీ రేవంత్ స్పందించారు. టీఆర్ ఎస్ పెంపుడు నేతలు కాదు...సీఎం కేసీఆర్ - మంత్రి కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. గిరిజనుడి అవకాశాలను కొల్లగొట్టిన కేటీఆర్ మామపై చర్యలు ఎందుకు తీసుకోరని ఆయన ప్రశ్నించారు.
ఎస్టీల పేరుతో కేసీఆర్ వియ్యంకుడు ఉద్యోగాన్ని చేసింది ముమ్మాటికీ నిజమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కేటీఆర్ మామ 35ఏళ్ళ సర్వీస్ పూర్తిచేయడమే కాకుండా ఇప్పుడు పెన్షన్ కూడా తీసుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఆయనపై తగు చర్యలు తీసుకొని ప్రజలకు కేసీఆర్ విశ్వాసం కల్పించాలని రేవంత్ రెడ్డి కోరారు. పిర్యాదు చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. హరనాథ్ రావు నుండి రికవరీ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. వియ్యంకుడిని కాపాడాలని కేసీఆర్ చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్ట్ లో ప్రభుత్వాన్ని బట్టలూడదీస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని వదిలి పెట్టదని రేవంత్ తెలిపారు. ట్విట్టర్ లో పలికే కేటీఆర్ కు తన మామ ఎస్టీలకు చేసిన మోసం కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ ఎస్టీ రిజర్వేషన్ పై మోసం చేయాలని చూస్తుంటే...అయన వియ్యంకుడు ఎస్టీల ఉద్యోగాన్ని కొల్లగొట్టి దగా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటి దాకా కేసీఆర్ పొలిటికల్ ఫిక్స్ చేస్తే ఎజెండా ఫిక్స్ చేస్తే ఇప్పడి నుండి తాను పిక్స్ చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. పాలకులు వారి మీద - వారి కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చినప్పుడు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. దళితున్ని సీఎం చేస్తా అని తానే సీఎం కుర్చీలో కూర్చున్న కేసీఆర్...ఇప్పుడు గిరిజనుల మధ్య కూడా చిచ్చుపెట్టారని ఆరోపించారు. `మీరు సీఎం అయ్యాక..పరిపాలనలో అవకతవలకు పాల్పడితే కొడుకు అయిన..బిడ్డ అయిన..జైల్లో పెడతా అనటాన్ని మేం నమ్మాం. మీ బంధువు పాకాల హరినాధ రావు..ఓ గిరిజన ఉద్యోగం కొట్టేశారు. మీరు గిరిజనులకు రేజర్వేషన్ ఇస్తా అని మోసం చేశారు..మీ బంధువు గిరిజన రేజర్వేషన్ లో ఉద్యోగం తీసుకొని మోసం చేశారు. మీ దొడ్లో ఉన్న జంతువులు ఉస్కో అని ఉసిగొల్పటం కాదు... సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం..తప్పుడు కుల దృవీకరణతో ఉద్యోగం పొందితే చర్యలు తీసుకోవాలని ఉంది. ఇప్పటి వరకు పొందిన లబ్ధిని కూడా వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి.. తప్పు చేసిన వాళ్ళను శిక్ష తప్పదు అని మీరు చెప్పిన మాటలు నిజమైతే చర్య తీసుకో` అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.2009 నుండి 2014 వరకు కేసీఆర్ ఎజెండా ఫిక్స్ చేశారని...కేసీఆర్ ను ఎక్కడ తిప్పాలో తనకు తెలుసు అని పేర్కొంటూ ఇప్పటి నుండి తాను ఎజెండా ఫిక్స్ చేస్తానని ప్రకటించారు.
నేరపూరిత కుట్రలో ఎప్పుడు పట్టుబడినా చర్య తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. `రాజకీయంగా మీరు మోసం చేసారు ఓకే... కానీ మీ బంధువులు కూడా..వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు కొల్లగొట్టాడు. మేం అడిగిన దానికి సంబంధం లేని మాటలు టీఆర్ ఎస్ మాట్లాడుతోంది. ఈ విషయంలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ప్రభుత్వంలో మీ వియ్యంకుణ్ణి కాపాడినప్పటికీ....కోర్ట్ లో కాపాడుకోలేరు కేసీఆర్` అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీనామాపై తర్వాత సమాధానం చెప్తానని...ముందు తాను పెట్టిన డిమాండ్ కి సమాధానం చెప్పాలన్నారు. టీఆరెస్ నేతలు కోర్ట్ లను కూడా అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు.