Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను ఓడిస్తామంటున్న రేవంత్‌

By:  Tupaki Desk   |   20 Dec 2017 5:04 PM GMT
కేసీఆర్‌ ను ఓడిస్తామంటున్న రేవంత్‌
X
జ‌డ్చ‌ర్ల‌లో జ‌న‌గ‌ర్జ‌న పేరుతో స‌మ‌వేశం ఏర్పాటుచేసిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా త‌న స‌హ‌జ‌శైలిలో విరుచుకుప‌డ్డారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి ల‌క్ష్మారెడ్డిపై ఆయ‌న మండిప‌డ్డారు. వైద్య మంత్రి నకిలీ డాక్ట‌ర్ అని ఆయ‌న ఎద్దేవా చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి అసలు డాక్టర్ కాదు మున్నా భాయ్ ఎంబీబీఎస్ అని వ్యాఖ్యానించారు. లక్ష్మారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారని ఆరోపించారు. హైద‌రాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 350ఎకరాల భూమి కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయని నిల‌దీశారు.

కాంగ్రెస్ కాల్వలు తవ్వితే...ఇప్పుడు టీఆర్ ఎస్ నేతలు ఫోటోలకు పోజులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు వస్తున్న రాబడిని కేసీఆర్ కుటుంబం విలాసాలకు వాడుకుంటోందని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ కోసం అప్పుడు బలిదానాలు చేసింది కేసీఆర్ కుటుంబం కోసమా అని రేవంత్ ప్ర‌శ్నించారు. అప్పుడు డబ్బా ఇండ్లు వద్దన్న కేసీఆర్ డ‌బుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టిస్తాన‌ని ప్ర‌క‌టించార‌ని...ఇప్పుడు అవి ఎటుపోయాయ‌ని నిల‌దీశారు. పేదోడికి ఇళ్ళు లేదు కానీ...వందల కోట్లతో సీఎం కేసీఆర్ పంజాగుట్టలో దొర గడి కట్టుకున్నారని ఆరోపించారు.

ఇంటికో ఉద్యోగం అని ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌...ఊరికో కోడి...ఇంటికో ఈక కూడా కేసీఆర్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. `గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌మ్మిట్‌లో భాగంగా ఇవాంకా ప్రోగ్రామ్ కు వెళ్లిన కేటీఆర్...నీవు ఆడవా?మాడవా?` అని నిల‌దీశారు. గుజరాత్ బిడ్డలను మనం ఆదర్శంగా తీసుకుందామ‌ని ప్ర‌తిపాదించారు. కేసీఆర్ ను గద్దె దింపుదామ‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురు తగ్గకుండా మహిళలకు మంత్రులుగా చేసి గౌరవిద్దామ‌ని వెల్ల‌డించారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ ఆర్సీ కుంతియా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. డబ్బులు, ఏవీఎం ట్యాంపరింగ్ తో గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. గుజరాత్ లో పొలిటికల్ వ్యూహాలతో రాహుల్ సత్తా చాటారని విమ‌ర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సోనియా తెలంగాణ ఇచ్చారని...కేసీఆర్ పాలనలో దేశం ఎక్కడ లేని విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2019లో కేసీఆర్‌ కు హటావో...తెలంగాణ బ‌చావో అనే నినాదంతో ముందుకు సాగాల‌ని కుంతియా తెలిపారు. కాంగ్రెస్‌తో చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారని కుంతియా వెల్ల‌డించారు. టీడీపీ- టీఆర్ఎస్‌ల‌ నుంచి త్వరలో చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి వస్తారని ఆయ‌న ప్ర‌క‌టించారు.