Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ కు జ్వ‌రం..రేవంత్ బ‌ర్త్‌ డే ట్వీట్ వైర‌ల్‌

By:  Tupaki Desk   |   24 July 2018 10:32 AM GMT
కేటీఆర్‌ కు జ్వ‌రం..రేవంత్ బ‌ర్త్‌ డే ట్వీట్ వైర‌ల్‌
X
సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ యువ‌నేత కేటీఆర్‌ కు నెటిజన్ల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. తన పుట్టినరోజున ఫ్లెక్సీలు - బ్యానర్లు - ప్రకటనలు ఇవ్వొద్దని...అదే విధంగా కేకేలు - బొకేలు ఇవ్వద్దని పిలుపునిచ్చారు. ఆ డబ్బును సీఎం సహాయ నిధికి అందజేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఇష్ట‌మైన సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్లో శుభాకాంక్ష‌ల వ‌ర‌ద కొనసాగింది. కేటీఆర్ ట్విట్టర్ పేజీలో బర్త్‌ డే విషెష్ ట్వీట్లు వెలువెత్తున్నాయి. బర్త్‌ డే విషెష్ చెప్పిన ప్రతి ఒక్కరికీ.. కేటీఆర్ థ్యాంక్స్ చెప్తూ రీట్వీట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్పందించారు కూడా`ఆదివారం రాత్రి నుంచి జ్వరం ఉంది. జ్వరం వల్ల ప్రత్యేకంగా ఎవరినీ కలువలేకపోతున్నాను` కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉదయం అందరూ చూస్తున్నా.. మీ అభిమానానికి ధన్యుడిని అంటూ మరో కామెంట్ చేశారు.

ఐటీ మినిస్టర్ కేటీఆర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రి జూపల్లి కృష్ణారావు - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఎంపీ బాల్క సుమన్ - డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ - ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - ఎమ్మెల్సీ రాములు నాయక్ - దర్శకుడు ఎన్. శంకర్ - యూఎస్ కాన్సులెట్ జ‌న‌ర‌ల్‌ కేథరిన్ హడ్డా - ఇజ్రాయెల్ అంబాసిడర్ డేనియల్ కార్‌ మాన్ - నటుడు మహేశ్ బాబు - బ్రహ్మజీ - ప్రియదర్శితో పాటు పలువురు ఉన్నారు. అయితే వీరిలో రేవంత్ రెడ్డి బర్త్ డే ట్వీట్ హాట్ టాపిక్ అయింద‌ని అంటున్నారు. కేటీఆర్ బ‌ర్త్‌ డే సంద‌ర్భంగా ఇటు ఫేస్‌ బుక్‌ లో అటు ట్విట్ట‌ర్‌ లో కూడా రేవంత్ స్పందించారు. రెండు వేర్వేరు పోస్టులు పెట్టి..త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

ఫేస్‌ బుక్‌ లో కేటీఆర్‌ను కెలికిన రేవంత్ రెడ్డి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో మాత్రం శుభాకాంక్ష‌లు తెలిపారు. ``జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు కేటీఆర్‌. ట్విట్ట‌ర్‌ లో కాదు...గ్రౌండ్‌ లో ఆడాలని నేను నీకు చాలెంజ్ విసురుతున్నాను`` అంటూ రేవంత్ కెలికారు. ఫేస్‌ బుక్‌ లో త‌న ఫ్యాన్స్ పేరుతో న‌డిపే https://www.facebook.com/TelanganaRevanthArmy/ పేజీ ద్వారా కేటీఆర్‌ వి కేవలం ఫిట్‌ నెస్ పోజులే. అవి నిజ‌మైతే నాతో 10కె రన్‌ కి రావాలి.రాజకీయాలే కాదు ఏ ఆటలో కేటీఆర్ నాతో పోటీ పడలేడు`` అంటూ సెటైర్‌ తో కూడిన స‌వాల్ విసిరారు. కాగా ఓ వైపు కేటీఆర్ జ్వ‌రంతో జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను కూడా చేసుకోలేని స్థితిలో ఉంటే..రేవంత్ ఆయ‌న్ను కెల‌క‌డం కొస‌మెరుపు.