Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారుకు రేవంత్ రూ.10వేల ఛాలెంజ్
By: Tupaki Desk | 20 Sep 2016 6:33 AM GMTసగటు హైదరాబాదీ ఆవేదనపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి గళం విప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిత్యం అవస్థలు పడుతున్న రోడ్ల దుస్థితిపై కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిత్యం లక్షలాది మంది నరకం చూస్తున్న రోడ్ల దుస్థితిపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన రేవంత్.. టీ సర్కారుకు తనదైన శైలిలో ఛాలెంజ్ విసిరారు.
శ్రీనగర్ కాలనీ నుంచి యూసఫ్ గూడ వరకు రోడ్లను పరిశీలించిన రేవంత్.. రహదారులకు పడిన గుంతల్ని పరిశీలించారు. గడిచిన కొద్ది నెలలుగా అధికారుల నిర్లక్ష్యం.. కేసీఆర్ సర్కారు సీరియస్ గా తీసుకోకపోవటంతో హైదరాబాద్ రహదారుల పరిస్థితి దారుణంగా తయారైన దుస్థితి. గతంలో ప్రతి వర్షాకాలంలోనూ రోడ్లు దెబ్బ తినటం.. వాటికి మరమ్మతులు చేయించటం.. మళ్లీ ఆర్నెల్లకు రోడ్లు పాడు కావటం తెలిసిందే. అయితే.. గడిచిన కొద్దినెలలుగా పాడైన రోడ్లకు మరమ్మతులు చేయించకపోవటం.. వరుస వర్షాలతో హైదరాబాద్ లోని అన్ని రోడ్లు దాదాపుగా గుంతలమయమైన పరిస్థితి.
దీంతో.. ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోవటంతో పాటు.. రోజూ వేలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దుస్థితి. వర్షాల కారణంగా రోడ్ల మీద కంకర తేలి ఉండటం.. వాటిని అట్టే ఉంచేయటంతో టూవీలర్లు స్కిడ్ అవుతూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ అవస్థలపై ఇప్పటివరకూ సరిగా గళం విప్పినోళ్లు లేరనే చెప్పాలి. ఆ మధ్యన మంత్రి కేటీఆర్ రోడ్ల మీద కాసింత హడావుడి చేసి.. రెండు వారాల్లో మారిపోవాలని చెప్పటం.. అలాంటి మాటల్ని వినే పరిస్థితుల్లో అధికారులు లేకపోవటంతో.. చివరకు మంత్రి కేటీఆరే.. మరో ఏడాది వ్యవధిలో రోడ్లను అద్భుతంగా తయారు చేస్తామని చెప్పారు. రోడ్లను బాగు చేయటానికి కూడా కేసీఆర్ సర్కారుకు ఏడాది టైం అవసరమయ్యే దుస్థితి.
ఇదిలా ఉంటే.. రహదారుల దుస్థితి మీద గళం విప్పిన రేవంత్.. తెలంగాణ సర్కారుకు సూటి సవాలు ఒకటి విసిరారు. గతంలో సిటీలో రోడ్డు మీద గుంత చూపిస్తే వెయ్యి ఇస్తామని మున్సిపల్ కమిషనర్ సవాలు విసిరారని.. తానిప్పుడు ఛాలెంజ్ చేస్తున్నానని.. గుంతలు లేని రోడ్డును చూపిస్తే తామే రూ.10వేలు ప్రభుత్వానికి ఇస్తామన్నారు. రహదారుల విషయంలో కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యాన్ని చూపించే ఈ ఛాలెంజ్ మీద టీ సర్కారు స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.