Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే దాడిపై ‘కులం’ కలర్ తెచ్చేశారు
By: Tupaki Desk | 6 Sep 2015 4:15 AM GMTపాలమూరు జెడ్పీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేయి చేసుకోవటం.. ఈ విషయం మీడియాలో ఫెద్ద ఎత్తున ఫోకస్ కావటం తెలిసిందే. దూకుడు రాజకీయాలు మరీ ఇంత దిగజారిపోయాయే అన్న వేదన వ్యక్తమైంది. రాజకీయంగా విబేధాలు ఉండటం మామూలే కానీ.. మరీ ఈ స్థాయిలోనూ అని పలువురు విస్మయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి.
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పడిన తర్వాత దూకుడుగా వ్యవహరించటం ఓ అలవాటుగా మారింది. ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ అన్న ట్యాగ్ లైన్ తో టీఆర్ ఎస్ నేతల దూకుడ్ని పలువురు సమర్థించే ప్రయత్నం చేశారు. తాజాగా ఎమ్మెల్యే పై దాడి వ్యవహారం సీరియస్ గా మారింది. చేయి చేసుకోవటాన్ని తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది.
ఇదిలా ఉంటే.. తాజా వివాదానికి సరికొత్త కలర్ తెచ్చే ప్రయత్నం చేశారు.. తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు వ్యవహారంలో జైలుకు వెళ్లి.. హైకోర్టు ఆదేశాలతో ఆంక్షల నడుమ.. నియోజకవర్గానికే పరిమితమైన ఆయన.. తాజా దాడి అంశానికి సరికొత్త కలర్ తీసుకొచ్చే ప్రయత్నం చేయటం గమనార్హం.
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై బాలరాజు చేయి చేసుకోవటాన్ని ఇప్పటివరకూ పార్టీ విబేధాల కోణంలో చూస్తున్న వారికి కళ్లు తెరిపించేలా సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. గతంలో చిన్నారెడ్డిపై దాడి జరిగినప్పుడు కళ్లు తెరిచి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదని రేవంత్ చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం పైనే తెలంగాణ సర్కారు దాడి చేస్తుందని.. వరుసగా జరుగుతున్న ఘటనలే దీనికి నిదర్శనం అంటూ సరికొత్త లాజిక్ ఆవిష్కరించారు. ఒకే సామాజిక వర్గంపై దాడుల వెనుక దొరల కుట్ర దాడి ఉందని ఆరోపించిన ఆయన.. నియంతను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఐక్యం కావాలని.. కేసీఆర్ సర్కారు దుర్నీతిని ప్రశ్నించాలని రేవంత్ చెబుతున్నారు.
ఇప్పటికే అధికారం చేజారి రగిలిపోతున్న సామాజిక వర్గానికి.. తాజాగా దాడుల వ్యవహారంలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుకు తెచ్చేలా.. దానికి సామాజిక వర్గం అంశాన్ని జత చేయటం చూసినప్పుడు.. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న సందేహం కలగక మానదు.