Begin typing your search above and press return to search.
దొరల చేతిలో పావుగా.. గువ్వల కొట్టాడా?
By: Tupaki Desk | 6 Sep 2015 6:04 PM GMTగువ్వల బాలరాజు.. స్వతహాగా ఆయన కరాటే మాస్టర్. ఆయన కొడితే అదోలా ఉంటుందని వాళ్లూ వీళ్లూ చెబితే మనం తెలుసుకోవాల్సిందే. క్షణికావేశాలకు లోనై కొట్టినా కూడా.. అసలు తన కరాటే మాస్టర్ అనే హోదా ద్వారా 'కొట్టడం' అనే ప్రక్రియలోని టెక్నిక్ తెలిసిన వాడు. అలాంటి బాలరాజును తెలంగాణ సర్కారును గుప్పిట పట్టుకుని ఏలుబడి సాగిస్తున్న 'దొరలు' తమ చేతి అస్త్రంగా వాడుకుంటున్నారా? తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి వేర్వేరు సందర్భాల్లో జరిగిన రాజకీయ దాడులు అన్నీ ఒకే వర్గం వారిని ఉద్దేశించి జరుగుతున్నాయా? తెలంగాణ లో ప్రస్తుతం కులాల ప్రాతిపదిక మీద రాజకీయ వైరం అనేది వెలమ దొరలు, రెడ్డి ల మధ్య నడుస్తున్నదా? అని ప్రశ్నలు సంధించినప్పుడు.. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాటలు గమనిస్తే మాత్రం అవుననే సమాధానమే వస్తోంది.
తెరాస సర్కారు ఏర్పడిన నాటినుంచి.. రెడ్డి వర్గాని కి చెందిన నాయకుల మీద వెలమదొరలు అకారణంగా దాడులు చేయిస్తూ.. కవ్విస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రెడ్డి వర్గానికి చెందిన నాయకుల మీదనే దాడులు జరుగుతున్నాయని.. దాడులు ఎవరు చేస్తున్నప్పటికీ.. వెలమ దొరలే వాటికి వెనుకనుంచి సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
దీనికి ఆయన అనేక ఉదాహరణలు ఇస్తున్నారు. గతంలో అసెంబ్లీ లో డికె అరుణను మహిళ అని కూడా చూడకుండా ఆమె దారుణంగా విరుచుకుపడ్డారని.. ఆ వ్యవహారాన్ని సభలో కేటీఆర్, హరీష్ లు స్వయం గా దగ్గరుండి నడిపించారని, ఆ తర్వాత చిన్నారెడ్డి మీద దాడి జరిగిందని, కొడంగల్‌లో తనపై దాడి జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ కు చెందిన రామ్మోహన్ రెడ్డి వంతు వచ్చిందని రేవంత్ అంటున్నారు. జడ్పీ లో జరిగిన ఈ దాడి వెనుక జూపల్లి కృష్ణారావు హస్తం ఉన్నదనేది రేవంత్ ఆరోపణ. నిజానికి దాడి సమయంలో మంత్రి జూపల్లి కూడా సభలోనే ఉండడం గమనార్హం. కులాల ప్రాతిపదికన రాజకీయాలు విడిపోవడం మంచి పరిణామం కాదు గానీ.. రేవంత్ చెప్పిన ఉదాహరణలు గమనిస్తే.. ఆయన మాటలు సబబుగానే కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు.