Begin typing your search above and press return to search.

అమిత్‌ షాతో హ‌రీశ్‌ భేటీ..తాను రెడీ అన్న రేవంత్‌

By:  Tupaki Desk   |   10 March 2018 4:07 PM GMT
అమిత్‌ షాతో హ‌రీశ్‌ భేటీ..తాను రెడీ అన్న రేవంత్‌
X
కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌జా యాత్ర‌లో భాగంగా మంత్రి ఈటల రాజేంద‌ర్‌ పై విమ‌ర్శ‌లు చేసిన రేవంత్ వాటిపై అధికార టీఆర్ ఎస్ పార్టీ విరుచుకుప‌డ‌టంతో మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ రావుపైనా మండిప‌డ్డారు. ఈటెల‌పై చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నట్లు రేవంత్ అయ్యారు. `నిజాయితీ ఉంటె ఈటల ఎందుకు స్పందించలేదు? పాత జిల్లా ల పేరుతో గుంటూరు వ్యక్తికి రేషన్ కార్డ్ ప్రింటింగ్ ఇచ్చి ఈటెల కోట్ల దండుకున్నది నిజం` అని వ్యాఖ్యానించారు. విచారణకు ఆదేశిస్తే నిరూపిస్తామ‌న్నారు. తాను చేసిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా మమ్మల్ని తిడుతున్నారని ఆరోపించారు. ఈటల అయినా లేక మ‌రే మంత్రి చర్చకు వచ్చినా తాను రెడీ అని ప్ర‌క‌టించారు. ప్రభుత్వం తాను చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తారని ఆశించామ‌న్నారు.

సీఎం కేసీఆర్ - ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావు `అల్లుడు ఆణిముత్యం...మామ కేసీఆర్ స్వాతి ముత్యం` అన్న‌ట్లుగా మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. `ఇన్నాళ్లు ఫిరాయింపు రాజకీయాలతో భ్ర‌ష్టు రాజకీయాలు చేసింది కేసీఆర్ హరీష్‌. టీఆర్ ఎస్‌ లో ఉంటే హరీశ్‌ రాజకీయంగా చావడం ఖాయం. కేసీఆర్ - కేటీఆర్ లు ఆయనను రాజకీయంగా చంపడం ఖాయం` అని అన్నారు. `గతంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని హరీశ్‌ కలిసి కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అని చెప్పింది నిజం కాదా..? టీఆర్ ఎస్‌ ను పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హరీశ్ ఒప్పందం చేసుకున్నది వాస్తవం.ఈటలను ఎల్పీ లీడర్ చేసినందుకు గతంలో హరీశ్‌ ది కేసీఆర్ పై తిరుగుబాటు ప్రయత్నం చరిత్ర` అని ఆరోపించారు.`

సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారమని హరి ఎవరికి వివరణ ఇస్తున్నారని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు. `కేసుల భయమో ..రాజకీయంగా బతకాలనో ..బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాను మంత్రి హ‌రీశ్ రావు కలిసింది నిజం కాదా..? బీజేపీలో కీలక నేతతో హరీశ్‌ మంతనాలు చేసింది ..చేస్తుంది వాస్తవం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితో హరీశ్ రహస్య ఒప్పందం చేసుకున్నారు. టీఆర్ఎస్‌లో హరీశ్‌ అవమానాలతో - ద్వితీయ శ్రేణి నేతగా ఉన్నారు. నిన్నటిదాకా హరీశ్‌ చేసిన పాపమే ఇప్పుడు అయన వంతు వచ్చింది. కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత పోరు కోసం మీడియాను అధికారులను బలిచేస్తారా? టీఆర్ ఎస్‌ వంద శాతం చీలడం ఖాయం. చీలికకు హరీష్‌...ఈటల ఎవరో ఒకరు వహిస్తారు. టీఆర్ ఎస్‌ లో ఉంటె హరీశ్‌ రావు మునగడం ఖాయం అని జోస్యం చెప్పారు.

కేసీఆర్ కుటుంబ బ్యాలెన్స్ షీట్ వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేల్చుతారని రేవంత్ రెడ్డి తెలిపారు. `కేసీఆర్ - కేటీఆర్ లను మభ్యపెట్టేందుకే హరీశ్‌ వివరణ ఇచ్చారు. కేసీఆర్ తనపై దాడిచేయిస్తారనే భయంతోనే హరీష్ వివరణ ఇచ్చారనుకుంటున్నాను. కేవలం టైం పాస్ కోసమే హరీష్ మీడియా సమావేశం. హరీష్ నన్ను సహాయం చేయమని కోరితే తప్పక సలహాయిస్తా` అని పేర్కొన్నారు.