Begin typing your search above and press return to search.
వైఎస్ ఆత్మతో కేసీఆర్ కు జిగిరీ దోస్తానా?
By: Tupaki Desk | 19 Aug 2016 5:25 PM GMTతెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ - ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోమారు తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరిట జరుగుతున్న భారీ అవినీతిని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ విషయంలో ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్ధమేనని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఇంకా అధికారికంగా వెల్లడించని ప్రాజెక్టు పనులకు సంబంధించిన టెండర్లను ఎవరెవరికి ఏ పేరుతో ఇవ్వనున్నారనే విషయం కూడా తాము ముందుగానే చెప్పగలమని ప్రకటించారు. ఈ వేల కోట్ల అవినీతి గురించి అవసరమైతే ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రేవంత్ రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణాలలో జరుగుతున్న అవినీతి అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరిట ధన యజ్ఞం చేశారని - వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీఆర్ ఎస్ నాయకులు బహిరంగంగా ఆరోపణలు చేసి ప్రస్తుతం టీఆర్ ఎస్ ప్రభుత్వం కూడా వైఎస్ ను ఆదర్శంగా తీసుకొని అదే ధనయజ్ఞాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు. గతంలో వైఎస్ కు ఆత్మగా వ్యవహరించిన కేవీపీ రామచందర్రావు ఇప్పడు కేసీఆర్ కు కూడా ఆంతరంగికుడిగా మారారని - ఆయన కనుసన్నలలోనే కాంట్రాక్టు పనులను కేటాయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ - కేవీపీల అనుబంధానికి సంబంధించి ఇటీవల పత్రికలలో పతాక శీర్షికలలో వచ్చిన ఫోటోలను గురించి ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. కేవీపీ - కేసీఆర్ కలిసి వేల కోట్ల రూపాయల టెండర్ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు పల్లీ బఠానీలా పంచిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు జలదృశ్యం పేరిట లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ - మంత్రి హరీశ్ రావులు బదులివ్వకుండా తెలివిగా ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావును వాడుకున్నారని విమర్శించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తలాతోకలేని విమర్శలు చేసేందుకు వాస్తవ జలదృశ్యం అని పేరేందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. అధికారంలో లేనపుడు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళుతున్నట్లున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోందని చెప్పారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయం గురించి ప్రస్తావిస్తూ ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.