Begin typing your search above and press return to search.
కూటమిపై కొత్త డౌట్ క్రియేట్ చేస్తున్న ఫైర్ బ్రాండ్
By: Tupaki Desk | 22 Feb 2022 7:30 AM GMTసంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా రేవంత్ రెడ్డిని చెప్పొచ్చు. తాను టార్గెట్ చేసిన వారిపై ఆయన సంధించే ఆరోపణాస్త్రాలు ఒక స్థాయిలో ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అదే పనిగా విరుచుకుపడే రేవంత్ రెడ్డి.. తాజాగా ఆయన జరిపిన మహారాష్ట్ర పర్యటన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతో హడావుడిగా.. ఆర్భాటంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ కేసీఆర్ అండ్ కో భేటీ కావటం తెలిసిందే.
దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విస్మయకర విషయాల్ని వెల్లడించారు. తమ భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చ జరగలేదని.. ఉద్దవ్.. శరద్ పవార్ లు స్పష్టం చేశారన్నారు.
కేసీఆర్ తో జరిగిన భేటీలో తెలంగాణ.. మహారాష్ట్ర డెవలప్ మెంట్ గురించే మాట్లాడుకున్నట్లుగా శరద్ పవార్ ప్రకటన చేయగా.. ఇరు రాష్ట్రాల డెవలప్ మెంట్.. సాగునీటి అంశాలపై మాట్లాడుకున్నట్లుగా ఉద్ధవ్ ట్రీట్ చేసిన వైనాన్ని గుర్తు చేశారు.
తాను ఏదో నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం లేదని.. తాను చెప్పిన విషయాలన్ని కూడా మహారాష్ట్రలోని స్థానిక మీడియా సంస్థల్లో అచ్చు అయిన వార్తలేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న మీడియా ప్రతినిధులకు ఆ క్లిప్పింగ్ లను చూపెట్టారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ గురించి తాము చర్చించలేదని చెబుతున్నా.. చర్చలు విజయవంతమయ్యాయి అని కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేసేందుకు కేసీఆర్ ఆడుతున్న నాటకంగా అభివర్ణించటం గమనార్హం.
మోడీని ఓడించాలనే ఉద్దేశమే కేసీఆర్ కు ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరుల్ని ఎందుకు కలవట్లేదని ప్రశ్నిచారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ర తీరు చూస్తే.. యూపీఏ పక్షాలను చీల్చి.. బీజేపీకి మేలు చేయాలన్నదే లక్ష్యమన్నట్లుగా కేసీఆర్ తరీు ఉందని రేవంత్ మండిపడ్డారు. కాస్త కన్వీన్స్ అయ్యేలా రేవంత్ మాటలు ఉన్నాయి కదా? మరి.. ఈ క్వశ్చన్లకు రేవంత్ ఏమని బదులిస్తారో చూడాలి.