Begin typing your search above and press return to search.

వంద మంది పీకేలు వ‌చ్చినా.. కేసీఆర్‌ను కాపాడ‌లేరు: రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   28 Feb 2022 5:30 PM GMT
వంద మంది పీకేలు వ‌చ్చినా.. కేసీఆర్‌ను కాపాడ‌లేరు:  రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
వంద మంది పీకేలు వచ్చినా తెలంగాణలో సీఎం కేసీఆర్ను కాపాడలేరని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు భయపడి బిహార్ నుంచి ప్రశాంత్‌కిషోర్ను తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వ సమీక్షకు రేవంత్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌పై ఆస‌క్తికర‌ కామెంట్లు చేశారు.

వంద మంది ప్రశాంత్‌కిషోర్‌లు, వెయ్యి మంది ప్రకాశ్‌రాజ్‌లు వచ్చినా రాష్ట్రంలో కేసీఆర్‌ను కాపాడలేరని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 38లక్షలకు పైగా కాంగ్రెస్‌ సభ్యత్వాలు నమోదయ్యాయన్న రేవంత్‌.. అధికారంలోకి వచ్చాక పథకాల్లో పార్టీ సభ్యులకే తొలిప్రాధాన్యం ఉంటుందన్నారు.

కాంగ్రెస్‌కు భయపడిన కేసీఆర్‌... బిహార్‌ నుంచి పీకేని తెప్పించుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ``సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశం ఉగాది పచ్చడిలాగా ఉంది. కొంత తీపి, కొంత చేదులా ఉంది.`` అని రేవంత్ వ్యాఖ్యానించారు.

నల్గొండ జిల్లాలో అత్యధికంగా సభ్యత్వాలు నమోదు జరిగాయ‌ని తెలిపారు. సికింద్రాబాద్లో అతి తక్కువ సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు. 34,69,053 వెరిఫైయిడ్ సభ్యత్వాలు జరిగాయని, మరో 3,50,000వేల అన్ వెరిఫైయిడ్ సభ్యత్వాలు జరిగాయని రేవంత్ వివ‌రించారు. జాతీయ స్థాయిలో బిజీగా ఉండడం వల్ల బూత్ స్థాయిలో సభ్యత్వాలు పట్టించుకోలేదన్నారు. బూత్ల్లో వంద సభ్యత్వాలు పూర్తి చేయకుంటే.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అందరి పదవులు తొలగిస్తామ‌ని నేత‌ల‌ను హెచ్చ‌రించారు.

మార్చి 25 లోపు ప్రతీ బూత్లో వంద సభ్యత్వాలు పూర్తి చేయాలని రేవంత్ చెప్పారు. బాగా పనిచేసిన వారికి పార్టీలో ప్రమోషన్ ఇస్తామ‌ని చెప్పారు. ఒకప్పుడు సిద్దాంతాల కోసం పార్టీలు పనిచేశాయని... కానీ ఇప్పుడు పోటీతత్వం పెరిగిందని అన్నారు. కార్యకర్తల కోసం కోట్లాడే భాధ్యత తనదేన‌ని పేర్కొన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఉందని తెలిపారు. ఏఐసీసీ మీటింగ్ల్లో తెలంగాణ కాంగ్రెస్ సభ్యత్వాల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు.

కేసీఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని బిహార్కు తాకట్టు పెట్టారని విమర్శించారు. ``బీహార్ ఐఏఎస్లకు పదుల సంఖ్యలో శాఖలు కేటాయించారు. తెలంగాణ ఐఏఎస్లకు ఎన్ని శాఖలు ఇచ్చారు? మహేందర్ రెడ్డికి ఆత్మగౌరవం ఉంటే.. డీజీపీ పదవికి రాజీనామా చేయాలి. కేసీఆర్ సొంత మీడియా సంస్థల్లో కూడా తెలంగాణ వారిని తొలగించి ఆంధ్రా వాళ్లకు బాధ్యతలు ఇచ్చారు`` అని రేవంత్ చెప్పుకొచ్చారు.