Begin typing your search above and press return to search.
కేసీఆర్ పరిస్థితి బ్రహ్మానందంలా ఉంది: రేవంత్ హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 12 Jun 2022 3:30 AM GMTముఖ్యమంత్రి కేసీఆర్ను చూస్తే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం గుర్తుకొస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఉనికిలేనప్పుడు పొత్తు పెట్టుకుంటానని తమ నేతల కాళ్లు ఎందుకు పట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను ఒక మాయల పకీరు అంటూ అభివర్ణించారు.
జాతీయ రాజకీయాల్లోకి పోవాలనుకుంటే పక్క రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్ది చేసి చూపడానికే కేసీఆర్ జాతీయ పార్టీ నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి) పార్టీ పెట్టి తెలంగాణలోనే పోటీ చేస్తారని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను జాతీయ నేతలు ఎవరూ విశ్వసించరని.. జాతీయ రాజకీయాల్లోకి పోవాలనుకుంటే ఏపీ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఈడీ విచారణ పేరుతో సోనియా, రాహుల్‌ను కించపరచాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేషనల్ హెరాల్డ్‌లో ఆర్థిక అవకతవకలు, అక్రమాలు జరగలేదని కేంద్రమే 2015లో చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకే మళ్లీ కేసును తిరగదోడారని ఆరోపించారు. జాతీయ సమగ్రత కోసం నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్నారని తెలిపారు. యంగ్ ఇండియా ట్రస్ట్ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పదవీ త్యాగాలకు మారుపేరు సోనియా, రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈడీ విచారణ పేరుతో సోనియా, రాహుల్‌ను కించపరచాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు.
గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్లేనని ప్రతి కార్యకర్తా స్పందించాలని సూచించారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలూ జరగనప్పటికీ.. ఈడీ సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు.
ఈ విషయంలో కాంగ్రెస్ శ్రేణులంతా శాంతియుత నిరసన వ్యక్తం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ సోమవారం ఈడీ కార్యాలయానికి వెళ్లి బయటకు వచ్చేంత వరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలన్నారు. రైతు రచ్చబండ కార్యక్రమాలు ఈ నెల 21వరకు చేయాల్సి ఉండగా.. మరో 15 రోజులు పొడిగించి జూలై 7 వరకు నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.