Begin typing your search above and press return to search.
నా బిడ్డ లగ్నపత్రికకు పోనీయలేదు.. ఇప్పుడు నీ బిడ్డ అనుభవిస్తోంది కేసీఆర్ : రేవంత్
By: Tupaki Desk | 5 Dec 2022 4:28 PM GMTతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆనాడు తనను అన్యాయంగా జైల్లో పెట్టించిన కేసీఆర్ కు ఇప్పుడు తత్త్వం బోధపడుతోందని రేవంత్ మండిపడ్డారు. తనను జైల్లో పెట్టి.. తన బిడ్డ లగ్న పత్రికకు కూడా వెళ్లకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాపం ఊరికే పోలేదని.. ఈరోజు కేసీఆర్ బిడ్డ కవిత ఇంటికి సీబీఐ వచ్చిందని అన్నారు. ఈ నొప్పి ఏమిటో ఇప్పుడు నీకు తెలుస్తోందా? అని రేవంత్ ప్రశ్నించారు.
మా ఉసురు నీకు తగిలి తీరుతుందని రేవంత్ అన్నారు. మా తాండూర్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసింది కేసీఆర్ కాదా? 37మంది ఎమ్మెల్యేలను కొన్నది కేసీఆరేనని ఆరోపించారు.
కాంగ్రెస్ ను లేకుండా చేస్తే ఆయన కొడుకు కేటీఆర్ కు తిరుగుండదని కేసీఆర్ భావిస్తున్నాడని.. అందుకే ఆవులాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్ కు కాంగ్రెస్ కార్యకర్తల ఉసురు తగులుతుందని.. టీఆర్ఎస్ చీలిపోతుందని ఇది చూసి కేసీఆర్ కృంగిపోతారని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను.. ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఈ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.
కొడంగల్ ను దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన జరగాలన్న రేవంత్ .. లేకపోతే గ్రామగ్రామాన తిరిగి టీఆర్ఎస్ తీరును ఎండగడుతానని హెచ్చరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.