Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయి?

By:  Tupaki Desk   |   19 Jan 2020 4:38 AM GMT
కేటీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయి?
X
లాజిక్ లతో కొట్టడం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి అలవాటు. ఆయన వేసే చిక్కుప్రశ్నలకు రాజకీయ ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతుంటారు. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి అలాంటి ప్రశ్నే వేశారు. తనకు ప్రత్యర్థులైన కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. లాజిక్ తో కొట్టిన రేవంత్ ప్రశ్న ఇప్పుడు వైరల్ గా మారింది.

2014 నాటికి 2018 నాటికి కేటీఆర్ ఆస్తుల విలువ ఏకంగా 425శాతం పెరగడం ఏంటని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లాజిక్ ప్రశ్న సంధించారు. దానికి ఆధారాలు చూపించారు.

2014 ఎన్నికల అఫిడవిట్లో అంటే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కేటీఆర్ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన ఆస్తుల విలువ కేవలం రూ.8కోట్లు మాత్రమే. ఇదే కేటీఆర్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.41కోట్ల ఆస్తులను చూపించారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి తాజాగా బయటపెట్టి సంచలనం సృష్టించారు.

కేవలం నాలుగేళ్లలోనే కేటీఆర్ ఆస్తుల విలువ 425శాతం ఎలా పెరిగిందని రేవంత్ రెడ్డి ధర్మసందేహం వ్యక్తం చేశారు. పుప్పాల గూడలో కేటీఆర్ కోటి రూపాయలకు కొన్న 26195 చదరపు అడుగుల స్థలం మార్కెట్ విలువ 26.19 కోట్లని.. అంత చీప్ రేటుకు కేటీఆర్ ఎలా దక్కించుకున్నారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. దీన్ని బట్టి అధికారం అండతోనే కేటీఆర్ ఆస్తులు సంపాదించుకున్నారని.. ఆయన నిర్వహించిన శాఖలపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.