Begin typing your search above and press return to search.
కేటీఆర్ ను చూస్తే జాలేస్తోందన్న రేవంత్ రెడ్డి
By: Tupaki Desk | 30 March 2022 1:30 PM GMTతెలంగాణ రైతుల లొల్లిలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చి చేరింది. తెలంగాణ వడ్లు కొనడం లేదని ఇన్నాళ్లు టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసింది. తాజాగా ఈ వివాదంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చి రగిలించారు. దీనికి కేసీఆర్ కూతురు కవిత, మంత్రి హరీష్ లు కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డి దీన్ని రగిలించారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి. కేటీఆర్ కు రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ కు ఉన్న నిబద్దత మీకు తెలియకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీ నాయన కేసీఆర్ ను అడగడం మంచిదని హితవు పలికారు. రైతు సమస్యల పరిష్కారానికి బదులు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ బిజీగా ఉండొచ్చని రేవంత్ సెటైర్ వేశారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల శ్రమను దోచుకుంటున్నారని రాహుల్ ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేని పనిని.. తాము చేసి చూపిస్తున్నామని కేటీఆర్ నిన్న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై తాజాగా రేవంత్ ఫైర్ అయ్యారు.
రేవంత్ ట్వీట్ చేస్తూ 'కేటీఆర్.. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోందని.. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతగా పాటుపడిందో పాపం మీకు తెలియదేమో..కాంగ్రెస్ చేసిందేంటో కేసీఆర్ ను అడగండి చెబుతారు. రైతుల సమస్యలను పరిస్కరించకుండా రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉన్నారని విమర్శించారు.
4 కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది కాంగ్రెస్ యేనని.. తమ ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. ఉచిత కరెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తెచ్చామని రేవంత్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 7వేల మంది రైతులను పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. బీజేపీతో కుమ్మక్కై రాజకీయం చేస్తూ రైతులను పావుగా వాడుకుంటోందని ఆరోపించారు.
మరో ట్వీట్ లోనూ రేవంత్ ఫైర్ అయ్యారు. 'మీరే బాధపడకండి కేటీఆర్. అన్ని విషయాల్లోనూ మీ లాంటి ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆర్టీఈ, ఆర్టీఐ వంటి వాటిని కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది' అంటూ రేవంత్ రెడ్డి ఘాటు సెటైర్లు వేశారు.