Begin typing your search above and press return to search.

ఎంబీబీఎస్ కు తక్కువ..ఆర్ ఎంపీకి ఎక్కువా?

By:  Tupaki Desk   |   10 Aug 2015 5:05 AM GMT
ఎంబీబీఎస్ కు తక్కువ..ఆర్ ఎంపీకి ఎక్కువా?
X
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి కొత్త సందేహాలు బయటపెట్టారు. ఆయన చెబుతున్న చదువు గురించి నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2004.. 2014 మధ్యన జరిగిన ఎన్నికల్లో తన అఫిడవిట్ లో దాఖలు చేసిన వివరాలు సరిపోవటం లేదని.. రెండూ భిన్నంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

తాను చేస్తున్న ఆరోపణలకు.. ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను ఆయన ప్రదర్శిస్తున్నారు.మంత్రి లక్ష్మారెడ్డి ఎంబీబీఎస్ కు తక్కువ.. ఆర్ ఎంపీకి ఎక్కువగా అభివర్ణించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంధిస్తున్న ప్రశ్నలు చూస్తే..

= హైదరాబాద్ కర్ణాటక ఎడ్యుకేషనల్ సొసైటీ 1981లో ప్రారంభమైతే.. 1987లో గుర్తింపు వచ్చింది. కానీ.. మంత్రి లక్ష్మారెడ్డి మాత్రం 1987లోనే బీహెచ్ ఎంఎస్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. అదెలా సాధ్యం?

= 2004 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో తాను బీహెచ్ ఎం ఎస్ కోర్సును 1988లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారని.. 2014 ఎన్నికల్లో 1987లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారని.. ఏది నిజమో చెప్పాలి?

= లక్ష్మారెడ్డి వైద్యునిగా ప్రాక్టీస్ చేసి ఉంటే.. ఆయుష్ దగ్గర కానీ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దగ్గర తన పేరును నమోదు చేయించుకున్నారా? ఒకవేళ అయితే.. ఆ వివరాలు చూపిస్తారా?

= మంత్రి లక్ష్మారెడ్డి తన కోర్సును అసలెప్పుడు పూర్తి చేశారు..?