Begin typing your search above and press return to search.
బీజేపీని కరివేపాకుతో సమానం చేసిన రేవంత్
By: Tupaki Desk | 11 Sep 2017 11:30 PM GMTపేరుకే మిత్రపక్షాలు అయినప్పటికీ ఎవరి దారి వారు అన్నట్లుగా సాగుతున్న తెలంగాణ బీజేపీ, తెలంగాణ టీడీపీల మధ్య చీలిక మరోమారు స్పష్టం అయింది. జాతీయ స్థాయిలో, పొరుగున ఉన్న ఏపీలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగడం లేదు. ఇప్పటికే టీడీపీతో కలిసిసాగడంపై బీజేపీలో అంతర్గతంగా అసంతృప్తి ఉండగా తాజాగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తమ మిత్రపక్షాన్ని కరివేపాకుతో సమానంగా తీసిపారేశారు.
హైదరాబాద్ లో ఈ రోజు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో కలవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అసలు బీజేపీ శాఖ తెలంగాణలో ఉండి చేస్తోంది ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టామని చెప్పుకొంటున్న మిషన్ భగీరథ పథకంలో అవినీతి చోటుచేసుకుందని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తుంటే.. మరో వైపు కేంద్రమంత్రులు, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ కేసీఆర్ పాలనను, మిషన్ భగీరథను పొగడటం ఎంత వరకు సమంజసమన్నారు. మిషన్ భగీరథ అవినీతిని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు ఈ విషయంపై సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. బీజేపీ విధానంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. అందుకే పార్టీతో అంటకాగాల్సిన అవసరం తమకు లేదన్నారు.
కాగా, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో గతవారం మాట్లాడుతూ....అధికార పక్షమైన టీఆర్ ఎస్ ను విమర్శించే క్రమంలో మిత్రపక్షం (!) అయిన టీడీపీని సైతం వాయించేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ముసుగులో టీడీపీ పాలన సాగుతోందని విమర్శించారు. గతంలో టీడీపీ నేతలు చెప్పిన మాటలనే చెప్తూ విలీన దినోత్సవాన్ని పక్కనపెడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు.