Begin typing your search above and press return to search.
ఫైర్ బ్రాండ్ అప్పుల మాటలు వింటే వణుకే..
By: Tupaki Desk | 1 Sep 2019 4:39 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డికి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ సర్కారుపై ఆయన చేసే వ్యాఖ్యలు సంచలనంగా ఉండటమే కాదు.. ఆయన చేసే ఆరోపణలు ప్రభుత్వాన్ని అదే పనిగా ఇరుకున పడేసేలా ఉంటాయి. పదునైన మాటలతో.. నొప్పి కలిగించేలా ఉండే విమర్శలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.
తాజాగా తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణ విద్యుత్ శాఖ సీఎండీ ప్రభాకర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు పెను కలకలాన్ని రేపుతున్నాయి. విద్యుత్ శాఖను అప్పుల కుప్పగా మార్చిన ప్రభాకర్ రావును వీధిలో చంపినా పాపం లేదన్న రేవంత్ మాట వివాదాస్పదమైంది. ఈ మాటలపై విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ.. రేవంత్ ఏ మాత్రం తగ్గట్లేదు. అంతేకాదు.. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ విద్యుత్ సంస్థల తీరు ఎంత దారుణంగా దిగజారిపోయిందన్న విషయాన్ని ఆయన గణాంకాలతో చెబుతుంటే.. విన్నోళ్లకు వణుకు పుట్టాల్సిందే.
ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు తమ 65 ఏళ్ల పాలనలో విద్యుత్ సంస్థల ద్వారా చేసిన అప్పులు రూ.20వేలు ఉంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం ఐదేళ్లలో భారీ అప్పులు మూటగట్టుకుందన్నారు. జూన్ 2 - 2014న ఏర్పడిన తెలంగాణలో ఇప్పటివరకూ తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన అప్పులు ఏకంగా రూ.74 వేల కోట్లకు చేరుకున్నట్లుగా చెప్పి సంచలనంగా మారారు.
తెలంగాణ విద్యుత్ సంస్థను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని.. వేలు పెడితే చాలు కూలిపోయేలా ఉందన్నారు. విద్యుత్ సంస్థల అప్పులు రూ.35వేల కోట్లేనని జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు చెబుతున్న మాటలన్ని అబద్దాలేనని చెబుతున్నారు. విద్యుత్ సంస్థలకు తెచ్చిన రుణాలపై వడ్డీ 11 శాతమన్నారు. ఈ వడ్డీ కట్టటానికే రూ.7వేల కోట్లు కట్టాల్సి వస్తోందని.. వడ్డీ కోసం మళ్లీ అప్పు చేయాల్సి వస్తోందన్నారు.
దక్షిణ మధ్య రైల్వేకు విద్యుత్ సరఫరా కోసం యూనిట్ కు రూ.7.10 చొప్పున తెలంగాణ విద్యుత్ సంస్థలు వసూలు చేస్తుంటే.. ఏపీ సంస్థలు మాత్రం యూనిట్ విద్యుత్ ను రూ.4.74చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కారణంగా తెలంగాణ విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కేన్సిల్ అయ్యేలా ఉన్నాయన్న కొత్త బాంబ్ పేల్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తి సామర్థ్యంలో 80 శాతానికి పైగా విద్యుత్ తయారు చేసిన ప్రభుత్వ ప్లాంట్లు.. తెలంగాణ వచ్చాక మాత్రం 69 శాతానికి పడిపోవటం దేనికి నిదర్శమని ప్రశ్నించటం సంచలనంగా మారింది. మరి.. ఈ ఆరోపణలకు కేసీఆర్ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరమైంది.