Begin typing your search above and press return to search.

బాబోయ్‌...రేవంత్ ఎన్ని మాట‌లు అనేశాడో

By:  Tupaki Desk   |   7 Jun 2016 2:04 PM GMT
బాబోయ్‌...రేవంత్ ఎన్ని మాట‌లు అనేశాడో
X
తెలంగాణ రాజ‌కీయ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్‌ కోదండరాం పై తెలంగాణ మంత్రులు చేసిన కామెంట్ల‌పై తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. త‌న‌దైన శైలిలో దూకుడుకు తోడుగా తీవ్ర‌మైన‌వ ఇమ‌ర్శ‌లు చేశారు. కోదండ‌రాంపై వెర్రెక్కిన చిత్తకార్తె కుక్కలా మంత్రులు విమ‌ర్శ‌లు చేశార‌ని మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు కూడా కోదండరాంను ఇంతలా అవమానించలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడికి టీఆర్ ఎస్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్ర‌శ్నించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న పద్మ దేవేందర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు.

"తలకు మాసిన తలసాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్‌ కూడా కోదండరాం నిబద్దతను ప్రశ్నిస్తాడా? తలసాని బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నప్పుడు - జూపల్లి కృష్ణారావు ప్రుడెన్షియల్ బ్యాంకును ముంచినప్పుడే - జగదీశ్ రెడ్డి కేసీఆర్ కు సారాలో సోడా కలుపుతున్న నాడే కోదండ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. హరీష్ పుట్టక ముందు, కేసీఆర్ చడ్డీ తొడగముందే తెలంగాణ సమాజంలో రాష్ట్ర ఆకాంక్ష ఉంది''అంటూ నిప్పులు చెరిగారు. బీసీల‌కు చెందిన మంత్రి ఈటల రాజేంద‌ర్ కూడా కేసీఆర్ గడీ వద్ద కాపలాకుక్కలా మారారని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. కోదండరాం ను నీచంగా చిత్రీకరించిన నమస్తే తెలంగాణ ను బహిష్కరించాల‌ని పిలుపునిచ్చారు. ఉద్యమకారులను కనుమరుగు చేయడమే ఆ పత్రిక ఎజెండా అని ఆరోపించారు. తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించే బాధ్యతను ప్రజలు త‌మ‌కు అప్పగించారని రేవంత్ రెడ్డి చెప్పారు. టీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్ గుంటనక్కలా ఫాం హౌస్ లో దాక్కోవడం కాదు..బయటకు వచ్చి వారి పార్టీ కుక్కలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాల‌ని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ​