Begin typing your search above and press return to search.
తెతెదేపాలో వాళ్లంతా కేసీఆర్ కూలీలంట!
By: Tupaki Desk | 11 Nov 2017 1:07 PM GMTకాంగ్రెసు పార్టీలో చేరిన చాన్నాళ్ల తరువాత రేవంత్ రెడ్డి ఘాటుగా గళం విప్పారు. కేసీఆర్ వ్యతిరేక స్వరాన్ని వినిపించడం మాత్రమే కాకుండా... తనని ఆడిపోసుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్న తెలుగుదేశం తెలంగాణ నాయకుల్ని కూడా తనదైన శైలిలో ఏకిపారేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఎల్.రమణ మీద రేవంత్ తెగ దూకుడు ప్రదర్శించడం గమనార్హం. నిజానికి రేవంత్ కాంగ్రెస్ లో చేరిన వ్యవహారాన్ని వ్యతిరేకించిన వారు.. మోత్కుపల్లి - అరవింద్ సహా మరికొందరు నేతలు తెదేపాలో ఉన్నప్పటికీ.. రేవంత్ మాత్రం.. తన కొడంగల్ నియోజకవర్గంలో సభ పెట్టి.. తనను దెబ్బ కొడతానని సవాళ్లు విసురుతున్న రమణ మీదనే రేవంత్ ఫోకస్ పెట్టడం విశేషం. తెలుగుదేశానికి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ.. కేసీఆర్ వద్ద ఉపాధి కూలీలాగా పనిచేస్తున్నాడంటూ రేవంత్ ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ లో చేరికను వ్యతిరేకించిన వారికంటె తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో తన హవాను దెబ్బతీయాలని చూస్తున్న పోకడమీదనే రేవంత్ కు ఆగ్రహం కలుగుతున్నట్లుగా ఉంది. ఎల్.రమణ - కేసీఆర్ నుంచి ఉపాధిహామీ లాగా కూలి డబ్బులు తెచ్చుకుని తన మీద ఆరోపణలు చేస్తున్నాడంటూ రేవంత్ స్పందించడం విశేషం. ఆయన మాటల్లో ప్రధానంగా.. కొడంగల్లో మీటింగ్ పెడతానంటున్న రమణ- సిద్ధిపేటలో గానీ - గజ్వేల్ లో గానీ మీటింగ్ పెడతా అనే సాహసం చేయగలడా అంటూ సవాలు విసురుతున్నారు.
ఈ క్రమంలో భాగంగా.. రమణ వ్యవహారంపై మరిన్ని తీవ్రమైన విమర్శలు కూడా వస్తున్నాయి. తెలుగుదేశం ముసుగులో పనిచేస్తున్న తెరాస కార్యకర్త రమణ అని - తెలంగాణ తెలుగుదేశంలో మిగిలిన వారినందరినీ తెరాసలోకి తరలించే వరకు రమణ ఊరుకోడని కూడా రేవంత్ ఆరోపణలు గుప్పించడం విశేషం. తాను కాంగ్రెసులో చేరితే మాత్రం ఆడిపోసుకుంటున్న రమణ - కంచర్ల భూపాల్ రెడ్డి తెరాసలో చేరితే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్న మాటలు.. ఈ అనుమానాలనే రేకెత్తించేలా ఉన్నాయి. తన పోరాటం కేసీఆర్ వద్ద పనిచేసే కూలీల మీద కానే కాదని.. డైరక్టుగా కేసీఆర్ మీదనే అంటూ రేవంత్ ముక్తాయించడం విశేషం.
రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని వీడినప్పడు అధినేత చంద్రబాబును చాలా బీభత్సంగా పొగిడేస్తూ సుదీర్ఘమైన లేఖ రాసి బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా పార్టీని వీసమెత్తు మాట అనకుండా.. తెలంగాణ తెదేపాలో మిగిలిన నాయకుల్ని మాత్రం.. ఒక రేంజిలో ఆడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.