Begin typing your search above and press return to search.

వార్ రూమ్‌లో రేవంత్‌రెడ్డిదే.. `పైచేయి`!!

By:  Tupaki Desk   |   15 Nov 2021 2:04 PM GMT
వార్ రూమ్‌లో రేవంత్‌రెడ్డిదే.. `పైచేయి`!!
X
`వార్ రూమ్‌` ఈ మాట విన‌గానే గుర్తుకు వ‌చ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్‌. ఎందుకంటే.. ఇత‌ర పార్టీల‌కంటే.. కూడా ఈ పార్టీలో లెక్క‌లు వేరేగా ఉంటాయి. అస‌మ్మ‌తి గ‌ళాలు.. నిర‌స‌న స్వ‌రాలు.. కాంగ్రెస్‌లో ఎక్కువ‌. అదేస‌మ‌యంలో పార్టీలోనూ క‌ల‌హాల కాపురాలు కూడా ఎక్కువే. అలాంటి స‌మ‌యాల్లో.. వార్ రూమ్ త‌లుపులు తెరుచుకుంటాయి.

ఆయా విష‌యాల‌పై మేదోమ‌థ‌నం చేస్తారు. అయితే.. గ‌త రెండు ఎన్నిక‌ల నుంచి కూడా కాంగ్రెస్ గ్రాఫ్ దాదాపు స‌న్న‌గిల్లుతోంది. అయిన‌ప్ప‌టికీ.. వాటి విష‌యంలో చ‌ర్చించేందుకు..ఎక్క‌డా.. వార్ రూమ్ త‌లుపులు తెరుచుకోలేదు. కానీ.. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఓట‌మిపై మాత్రం వార్ రూమ్ చ‌ర్చ జ‌రిగింది.

నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఉత్త‌ర భార‌త దేశంలో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎ న్నిక‌ల్లో పార్టీకి చ‌చ్చు ఫ‌లిత‌మే వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా వార్ రూమ్ త‌లుపులు తెరుచుకోలేదు. ఇక‌, మ‌రో ఆరు మాసాల్లో.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్నాయి.

ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకుఎవ‌రూ ముందుకురావ‌ట్లేదు. అంతేకాదు.. కాంగ్రెస్ ను దూరం పెట్టాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు జ‌రుగుతున్న త‌ప్పులు ఏంటి? అనే విష‌యంపై వార్ రూమ్‌లో చ‌ర్చలు జ‌ర‌గ‌లేదు. అంతేకాదు.. రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయిన‌ప్పుడు కూడా చ‌ర్చించ‌లేదు.

కానీ, ద‌క్షిణాది రాష్ట్రాల‌కు వ‌చ్చే స‌రికి మాత్రం వార్ రూమ్ త‌లుపులు ఎప్పుడూ..తెరిచే ఉంటాయి. ద‌క్షిణాది నేతల‌పై పెత్త‌నం చేసేందుకు నాయ‌కులు ఎప్పుడూ.. రెడీగా ఉంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా హుజూరాబాద్ విష‌యంలో రాష్ట్ర పార్టీ చీఫ్ రేవంత్‌కు.. వార్ రూమ్‌లో త‌లంటేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

దీంతో హుజూరాబాద్ ఓట‌మిపై.. వార్ రూమ్‌లో చ‌ర్చించారు. వాస్త‌వానికి ఇక్క‌డ బ‌ల‌మైన నాయ‌కుడుగా ఉన్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించ‌డం.. ద్వారా.. టీఆర్ ఎస్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయొచ్చ‌నేది వ్యూహం. దీనివ‌ల్ల టీఆర్ ఎస్ దూకుడు త‌గ్గితే.. ఆటోమేటిక్‌గా కాంగ్రెస్ పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే.. పార్టీలో నేత‌లు అంద‌రూ కూడా .. హుజూరాబాద్ విష‌యాన్ని పెద్ద‌ది చేసి చూశారు. యూపీలో పార్టీకి డిపాజిట్లు రాక‌పోయినా..ఎవ‌రూ చ‌లించ‌లేదు. కానీ, తెలంగాణ‌లో మాత్రం కాంగ్రెస్ నేత‌ల‌పై.. ఏఐసీసీ రెక్క‌లు విప్పుకొని వార్ రూమ్ చ‌ర్చ‌ల‌కు వ‌చ్చేస్తుంద‌నే టాక్ ఉంది. ఈ క్ర‌మంలోనే హుజూరాబాద్ విష‌యంపై రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేసేందుకు వార్ రూమ్ చ‌ర్చ‌లు న‌డిచాయి. అయితే.. చ‌ర్చ‌లు ఎలా ఉన్నా.. ఏం జ‌రిగినా.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో రేవంత్ రెడ్డిదే .. పైచేయి అయింద‌నే టాక్ వ‌స్తోంది.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయ‌డంకంటే.. మీమీనియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ప‌రుగులు పెట్టించ‌డంపైనే శ్ర‌ద్ధ పెట్టాలంటూ.. ఏఐసీసీ పెద్ద‌లు క్లాస్ పీకార‌ని.. తెలుస్తోంది. మొత్తంగా రేవంత్‌రెడ్డికే ఏఐసీసీ జై కొట్టింద‌ని.. రాబోయే రోజుల్లో పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. గెలిపించాల‌ని కోరుతూ.. ఆయ‌న బెస్ట్ విషెస్ చెప్పార‌ని.. అంటున్నారు. ఇదీ.. సంగ‌తి!!