Begin typing your search above and press return to search.
కోర్టు కంటె ఈసీ మేలనుకున్న రేవంత్!
By: Tupaki Desk | 2 Feb 2018 7:34 AM GMTరేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. ఆయన తెలుగుదేశం లో ఉన్నంత కాలమూ.. తెతెదేపా నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిపై అనర్హత వేటు వేయించడం కోసం సాగించని పోరాటం అంటూ లేదు. ఒకవైపు అసెంబ్లీ స్పీకరుకు లేఖలు ఇవ్వడమూ - ఫాలోఅప్ లు చేయడంతో పాటూ.. రెండో వైపు సుప్రీం కోర్టు దాకా కేసులు కూడా నడుపుతూ రేవంత్ చాలా కష్టపడ్డారనే చెప్పాలి. కానీ తానే కాంగ్రెసు పార్టీలోకి ఫిరాయించిన తర్వాత.. ఆయనకు ఆ శ్రమ లేకుండాపోయింది. పైగా తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారాక.. ఆ అంశంపై పోరాడే అర్హతను ఆయన కోల్పోయారు. అలా తనకు చాన్సు తగ్గినా.. ఏదో ఒక రకంగా తెరాసను ఇరుకున పెట్టడం లక్ష్యమైన రేవంత్ రెడ్డికి... ‘లాభదాయక పదవులు’ అనే మిష మీద ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యేలపై పడిన వేటు లడ్డూలా కనిపించినట్లుంది. అందుకే ఆయన ఈసీ తలుపుతట్టి - గులాబీ దళాల్లో వణుకు పుట్టిస్తున్నారు.
ఇతర పార్టీలనుంచి తెరాసలోకి ఫిరాయించిన వారి మీద చర్యలు తీసుకోవడానికి సాగించిన పోరాటం విఫలం అయింది. అది ఎలా పోయినా తెరాసను ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టి తీరాల్సిందే అనే పట్టుదల. అందుకే రేవంత్ ఈ తాజా మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటరీ సెక్రటరీలు అనే పదవులను నిర్వహించినందుకు.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నియమించిన వారిలో 20 మంది ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘం ఫిర్యాదును బట్టి రాష్ట్రపతి వేటు వేయడం జరిగింది. దీనిపై దేశంలో చాలా పెద్ద వివాదమే నడుస్తోంది. లాభదాయక పదవులు- అనే పదానికి రాజ్యాంగ నిర్వచనాల మీద కూడా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రేవంత్ తెలంగాణలో కూడా ఇలాంటి పార్లమెంటరీ సెక్రటరీ లు అనే పదవులు వెలగబెట్టిన వారి పాత చరిత్రను ఇప్పుడు తవ్వి తీస్తున్నారు. కేసీఆర్ సర్కారు గద్దె ఎక్కిన కొత్తల్లోనే కేబినెట్ హోదాలతో.. ఇలాంటి పార్లమెంటరీ సెక్రటరీ పదవులను పలువురికి కట్టబెట్టారు. వారిలో గులాబీ ఎమ్మెల్యేలే తొమ్మిది మంది ఉన్నారు. వారి మీద రేవంత్ ఫోకస్ పెట్టాడు. కోర్టుతో పని జరగడం లేదని అనుకున్నారేమో.. ఆప్ మీద వేటు స్ఫూర్తితో ఈసీకి - నేరుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దీంతో గులాబీ దళాల్లో కంగారు పుడుతోంది. కేవలం ఏడాదిరోజులే ఉన్న పదవీ కాలానికి ఇప్పుడు గండం వస్తుందా అని వారు భయపడుతున్నారు. మరోవైపు కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో వారంతా పదవులు ఎన్నడో కోల్పోయారు గనుక.. రేవంత్ ఫిర్యాదుకు విలువలేదని.. ఆప్ వ్యవహారం - తెలంగాణ వ్యవహారం వేరు వేరనే వాదనలు కూడా ఉన్నాయి.
అయితే అన్నిటినీ మించి.. పార్టీ మారినా సరే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి నైతికత మరియు విలువల గురించి ఇలాంటి పోరాటాలు చేయడం గిమ్మిక్కుగా ప్రజలు భావిస్తారే తప్ప ఆయన బావుకునేది ఏమీ ఉండదని తెరాస నాయకులు రిటార్టులు ఇస్తున్నారు.