Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఒప్పుకున్న త‌ర్వాతే రేవంత్ రాజీనామా

By:  Tupaki Desk   |   21 Nov 2017 4:51 AM GMT
కేసీఆర్ ఒప్పుకున్న త‌ర్వాతే రేవంత్ రాజీనామా
X
అదేంటి...ఉప్పు నిప్పులా ఉండే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కొడంగ‌ల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామాకు లింకేంటి? ఇద్ద‌రికి ఉన్న బ‌ద్ద శ‌త్రుత్వం గురించి తెలిసిందే క‌దా అనుకుంటున్నారా? అవును...మీరు అంచ‌నా వేసిన‌వ‌న్నీ నిజాలే!. అలాగే మేం ప్ర‌స్తావిస్తున్న‌ది కూడా నిజ‌మే!! తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒప్పుకొంటేనే రేవంత్ రాజీనామా చేస్తార‌ని ఆయ‌న స‌న్నిహిత‌వ‌ర్గాలు అంటున్నాయి.

తెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ ఆ ప‌త్రాన్ని టీడీపీ ర‌థ‌సార‌థి చంద్ర‌బాబుకు అందించి...కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న రాజీనామాను రేవంత్ స్పీక‌ర్‌ కు అందించ‌లేదు. దీంతో ఆయ‌న‌పై స‌హ‌జంగానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ అయితే మ‌రో అడుగు ముందుకు వేసి రేవంత్ పారిపోయాడ‌ని ఎద్దేవా చేసింది. ఇలా వ‌రుస‌గా విమ‌ర్శ‌లు వ‌స్తున్న‌ నేప‌థ్యంలో రేవంత్ త‌న ఎజెండాను స‌న్నిహితుల‌తో పంచుకున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న రేవంత్ ఈ సంద‌ర్భంగా తన రాజీనామాపైనా ఆయన సృష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తన రాజీనామాను అడుగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర పార్టీల నుండి గెలిచి టీఆర్‌ ఎస్‌ పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధమైతే, తాను కూడా సిద్ధమేనని త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది. త‌ద్వారా టీఆర్‌ ఎస్‌ ను ఇరుకున పెట్టాలన్న ఆలోచనతో రేవంత్‌ ఉన్నారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంటున్నారు.

త‌ను పార్టీ మారితేనే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అయితే... ఏకంగా పార్టీ ఫిరాయించి మంత్రి ప‌ద‌వులు పొందిన వారి సంగ‌తి ఏంట‌ని రేవంత్ రెడ్డి నిల‌దీయ‌నున్నార‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా వ‌వ్య‌వ‌హ‌రించ‌న‌ప్పుడు ఇత‌రుల‌ను ప్ర‌శ్నించే హ‌క్కు ఎక్క‌డ ఉంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా త‌న రాజీనామా పంచాయ‌తీని రేవంత్ లౌక్యంగా డీల్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.