Begin typing your search above and press return to search.
ఎంపీ కోమటిరెడ్డికి రేవంత్ క్షమాపణలు అందుకేనా?
By: Tupaki Desk | 13 Aug 2022 6:22 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వెంకటరెడ్డి పాత్ర ఎంతో కీలకమన్నారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అవసరమని తెలిపారు. చండూరులో జరిగిన సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడటాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. దయాకర్ చేసిన వ్యాఖ్యలపై తాను వెంకటరెడ్డికి కమాపణలు చెబుతున్నానని అన్నారు.
అద్దంకి దయాకర్ పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయాల్లో ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదని.. ఎవరైనా సరే పరిమితులకు లోబడే మాట్లాడాల్సి ఉంటుందనేది తెలుసుకోవాలన్నారు.
దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కమాపణలు తెలియజేస్తూ ఓ వీడియోను రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో పోస్టు చేశారు. తెలంగాణ సాధనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక భూమిక పోషించాడని అందులో ప్రశంసించారు.
రేవంత్ రెడ్డి వీడియోలో పేర్కొన్న సారాంశమిదీ..
ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన, మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలం వాడటంతో వారు ఎంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా సారీ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణ చెబుతున్నా. ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డిని అవమానించే విధంగా ఎవరూ మాట్లాడిన తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి సూచన చేయడం జరుగుతందని రేవంత్ రెడ్డి తన వీడియోలో పేర్కొన్నారు.
కాగా చండూరు సభలో తనను అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకు మునుగోడుకు దూరంగా ఉంటానని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ ఓ మెట్టు దిగి కోమటిరెడ్డికి క్షమాపణలు చెప్పారు.