Begin typing your search above and press return to search.
రేవంత్ చెప్పిన కేసీఆర్ కొత్త స్కాం ఇదే
By: Tupaki Desk | 9 Jan 2018 5:41 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై మరోమారు కాంగ్రెస్ ఎమ్ ఎల్యే రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ దఫా మరిన్ని గత ఆరోపణలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సర్కార్ విద్యుత్ సరఫరా ముసుగులో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. దివాళా తీసిన కంపెనీలతో ఒప్పందాలతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్న ఒప్పందాలలో అత్యంత అవినీతి దాగుందని దుయ్యబట్టారు.
నాడు కాంగ్రెస్ ముందు చూపుతున్న నిర్ణయాలతోనే దేశ వ్యాప్తంగా మిగులు విద్యుత్ సాధ్యం అయిందని పేర్కొంటూ విద్యుత్ మిగులు - సరఫరాలో కేసీఆర్ సాధించింది శూన్యమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో అధనపు విద్యుత్ తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. కమిషన్ లు రావనే కారణంతోనే చట్టం ఉన్నప్పటికీ ఏపీ విద్యుత్ ను కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్ మాల్ ఒప్పందాలేనని ఆయన ఆరోపించారు.ఒక్క సంస్థకు గోల్ మాల్ ఒప్పందా ల తో ప్రభుత్వం 957 కోట్లు చెల్లించింది నిజం కాదా అని ప్రశ్నించారు. `ప్రభుత్వం మూడున్నర ఏళ్లుగా ఏ సంస్థల తో కొన్నది ,ఏ ధరకు విద్యుత్ కొన్నది, వారికి చెల్లించిన మొత్తమెంతో శ్వేత పత్రం ఇవ్వాలి. విద్యుత్ కొనుగోళ్లు-సరఫరాపై జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు అబద్దాలు చెబుతున్నారు. విద్యుత్ కొనుగోళ్లపై ప్రభాకర్ రావుతో చర్చకు కాంగ్రెస్ సిద్ధం.` అని స్పష్టం చేశారు.
దివాల తీసిని ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇచ్చే కమీషన్ల కోసం ప్రభుత్వ విద్యుత్ సంస్థల్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రేవంత్ ఆరోపించారు. `ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు లాభం చేకూర్చే విదంగా,వీరికి కమిషన్ అందేలా ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీని వెనకాల ఎలాంటి ప్రైవేట్ ఒప్పందాలు ఉన్నాయి బయట పెట్టాలి.` అని డిమాండ్ చేశారు. కేసీఆర్ అడ్డుగోలు అవినీతి ఒప్పందాలకు అధికారులు సంతకాలు చేస్తున్నారని...రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ మాట విననందుకే ఐఏఎస్ లు సురేష్ చంద్ర -అరవింద్ కుమార్ లను తప్పించింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. డిస్ట్రిబ్యూషన్ లకు ఐఏఎస్ లను కాకుండా...కేసీఆర్ సన్నిహితులను నియమించుకున్నారని ఆరోపించారు. `ఐఏఎస్ ల స్థానంలో అర్హత లేని అధికారులను నియమించడం ద్వారా తెలంగాణకు వచ్చిన లాభం ఏంటో కేసీఆర్ చెప్పాలి. విద్యుత్ సరఫరా తీరు చూస్తుంటే .. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నట్లుంది` అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ను విమర్శిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి ముందు తన బతుకేంటో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.