Begin typing your search above and press return to search.
20 ఏళ్ల నాటి సంక్షోభం..రేవంత్ సృష్టించాడట
By: Tupaki Desk | 22 Oct 2017 10:11 AM GMTతెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జంపింగ్ పరిణామం కలకలం సృష్టిస్తోంది. పార్టీకి నమ్మినబంటుగా ఉండటమే కాకుండా భవిష్యత్ ఆశాకిరణంగా ఉన్న రేవంత్....అనూహ్య రీతిలో కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్తూ...కాంగ్రెస్ పార్టీకి చేరువ అవడం టీడీపీని కుదులు చేయడం అలా ఉంచితే...మరో రికార్డుకు కూడా కారణమవుతోందని అంటున్నారు. పార్టీ పైకి గుంభనంగా వ్యవహరిస్తున్నప్పటికీ లోలోపల తీవ్రంగా మథనపడుతోంది.
పార్టీకి నష్టం కలిగించే వార్తలు వచ్చినా, కార్యకర్తలతో అభద్రతాభావం కలిగించే వార్తలు వచ్చిన ఆ వ్యక్తులు ప్రపంచంలో - దేశంలో - రాష్ట్రంలో ఎక్కడ ఉన్న ప్రసార మాధ్యమాల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్.రమణ ఆదేశించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అయితే ఇంతగా కలవరం గురయ్యేందుకు రేవంత్ ఇస్తున్న బంపర్ షాక్ కారణమని చెప్తున్నారు. రేవంత్ తనొక్కడే పార్టీ మారడం కాకుండా దాదాపుగా 20 మంది ముఖ్యనేతలతో కాంగ్రెస్ గూటికి చేరువ అవుతున్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే సహా మాజీ మంత్రులు - జిల్లా పార్టీ అధ్యక్షులు - రాష్ట్ర కార్యవర్గ కీలక నేతలతో రేవంత్ కాంగ్రెస్ లో చేరడం టీడీపీలో భారీ సంక్షోభానికి నిదర్శనమని అంటున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు - మాజీ సీఎం నందమూరి తారకరామారావు దాదాపు 20 ఏళ్ల క్రితం ఎదుర్కొన్న పరిస్థితులే టీడీపీలో మళ్లీ తలెత్తాయని టీడీపీ పరిణామాలను సన్నిహితంగా చూసిన వారు చెప్తున్నారు. అయితే పోలికలో కాస్త తేడా ఉందుంటున్నారు. 20 ఏళ్ల కిందటి సంక్షోభం టీడీపీలో నాయకత్వ పగ్గాలను ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు మారిస్తే ఈనాటి సంక్షోభం యావత్ పార్టీనే ప్రశ్నార్థకంలో పడేసిందని చెప్తున్నారు. ఈ పరిణామాన్ని రాజకీయ పరిణతి కలిగి ఉన్న బాబు ఎలా డీల్ చేస్తారో చూడాలని చెప్తున్నారు.