Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వృద్ధ జంబూకాలను రేవంత్ రెడ్డి తొక్కేశాడా?

By:  Tupaki Desk   |   20 Aug 2020 5:00 PM GMT
కాంగ్రెస్ వృద్ధ జంబూకాలను రేవంత్ రెడ్డి తొక్కేశాడా?
X
కాంగ్రెస్ ఎంపీ, యువనేత రేవంత్ రెడ్డి అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందాడు. రేవంత్ రెడ్డి ఏమీ చేసినా డిఫెరెంట్ గానే చేస్తాడు. అందుకే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. రెండు సార్లు జైలుకు కూడా వెళ్లాడు. దేనికీ భయపడని నైజం.. దూకుడు అతడి సొంతం. మీడియాతో చిట్ చాట్ ఎక్కువ. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తుంటాడు.

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఎంపీగా మళ్లీ గెలిచి నిరూపించుకున్నాడు. ఇప్పుడు పీసీసీ రేస్ లో ముందు ఉన్నాడు. ఏఐసీసీ చేసే ఆన్ లైన్ సర్వేల్లో రేవంత్ ముందంజలో ఉన్నాడు. అయితే పార్టీలో రేవంత్ అంటే సీనియర్లకు గిట్టడం లేదు. ముఖ్యంగా 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఉన్నవృద్ధ జంబూకాలకు పీసీసీ చీఫ్ ఇవ్వకుండా.. నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి పట్టం కట్టడం ఏందని వారంతా ప్రశ్నిస్తున్నారు.

కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ లో అంతా యూత్ బ్యాచ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో నరేంద్రమోడీ కేవలం సోషల్ మీడియాతోనే 35శాతం ఓట్లు సాధించాడు. అలాగే టీఆర్ఎస్ లో కేటీఆర్ కి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి నాయకుడు కాంగ్రెస్ లో కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే అధిష్టానానికి కనపడుతున్నాడు

తెలంగాణలో రెడ్డిలకు కాంగ్రెస్ అంటే మొదటి నుంచి అభిమానం ఉంది. దాన్ని క్యాష్ చేసుకుంటూ సీనియర్స్ అందరినీ ఒకతాటిపైకి తీసుకొని రావాలని.. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చి పాదయాత్ర చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. టీడీపీ ఓట్లను కాంగ్రెస్ కు టర్న్ అయ్యే విధంగా చంద్రబాబును ఒప్పించాలని.. అది రేవంత్ అయితేనే సాధ్యం అని ఏఐసీసీ అనుకుంటోంది. ఇప్పుడిదే ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట..