Begin typing your search above and press return to search.
రేవంత్ అంత పెద్ద సాహసం చేశాడా?
By: Tupaki Desk | 3 Jun 2016 9:31 AM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చేసిన ఒక సాహసం ఇప్పుడు పొలిటికల్.. మీడియా సర్కిల్స్ తో ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీసుల కళ్లు గప్పి ఉస్మానియా క్యాంపస్ లో నిర్వహిస్తున్న జనజాతరకు రేవంత్ హాజరైన విధానం షాకింగ్ గా మారింది. ప్రజాదరణ ఉన్న నేతగా రేవంత్ అంత సాహసం చేశారా? అన్న విస్మయం వ్యక్తం కావటం ఖాయం.
ఉస్మానియాలోకి నేతలు వెళ్లటం అంత చిన్న విషయం కాదు. పోలీసులు అడ్డుకోవటం ఒక ఎత్తు అయితే.. విద్యార్థుల రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించని పరిస్థితి ఉంటుంది. గతంలో టీటీడీపీకి చెందిన నాగం జనార్దనరెడ్డికి జరిగిన పరాభవాన్ని మర్చిపోకూడదు. అందుకే.. ఉస్మానియా క్యాంపస్ లోకి అడుగు పెట్టాలని భావించే నేతలంతా ఒకటికి రెండుసార్లు ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా క్యాంపస్ లో నిర్వహించిన జనజాతరకు రేవంత్ రహస్యంగా వెళ్లారు. ఆయన వెళ్లిన తీరు పోలీసులకు సైతం షాకింగ్ గా మారింది. ఇంతకీ పోలీసుల కళ్లు గప్పి రేవంత్ ఓయూ క్యాంపస్ లోకి ఎలా వెళ్లారన్న విషయంలోకి వెళితే.. రేవంత్ ఒక స్టూడెంట్ మాదిరి ఫుల్ హ్యాండ్స్.. జీన్స్ వేసుకొని.. టూవీలర్ మీద యూనివర్సిటీలోకి వచ్చారట.
ఉస్మానియాలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కు ఎదురుగా విద్యార్థులు దూరేంత చిన్న దారి ఒకటి ఉంటుంది. అందులో నుంచి విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. సరిగ్గా ఆ మార్గాన్నే ఎంచుకున్నారు రేవంత్. అయితే.. అలా వెళ్లటానికి చాలానే ధైర్యం ఉండాలి. ఏ చిన్న తేడా వచ్చినా ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
అలా చిన్న మార్గం ద్వారా క్యాంపస్ లోకి అడుగు పెట్టిన రేవంత్.. వేదిక వరకూ నడుస్తూ వచ్చినట్లుగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన పోలీసుల పహరా నేపథ్యంలో రేవంత్ సభకు వచ్చే అవకాశం లేదని భావించినా అందుకు భిన్నంగా వచ్చిన ఆయన్ను చూసిన ఉస్మానియా విద్యార్థులు ఈలలతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్.. తన ప్రసంగం పూర్తి అయిన తర్వాత ఆయన వేదిక వెనుక భాగంలో ఏర్పాటు చేసిన కారులో వెళ్లినట్లుగా తెలుస్తోంది. మిగిలిన నేతల మాదిరి కాకుండా తనకు ధైర్యం ఎక్కువేనన్న విషయాన్ని రేవంత్ ఈ ఘటనతో నిరూపించారని చెప్పొచ్చు.