Begin typing your search above and press return to search.

అవి మాత్ర‌మే రేవంత్‌ కున్న ఆస్తుల‌ట‌!

By:  Tupaki Desk   |   30 Sep 2018 5:06 AM GMT
అవి మాత్ర‌మే రేవంత్‌ కున్న ఆస్తుల‌ట‌!
X
పెద్ద ఎత్తున ఆక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. త‌న‌కున్న ఆస్తుల‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. దాదాపు రెండు రోజుల‌కు పైనే రేవంత్ ఇంట్లో పాటు.. ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు చోట్ల ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించిన నేప‌థ్యంలో త‌న‌కున్న ఆస్తుల‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు రేవంత్‌.

త‌న ఆస్తుల‌పై ప్ర‌ధానంగా నాలుగు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. వాటికి తాను వివ‌ర‌ణ ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు చెప్పారు. 2007లో ఎమ్మెల్సీ.. 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన‌ప్పుడు ఎన్నిక‌ల ప్ర‌మాణ‌ప‌త్రాల్లో ద‌స్తావేజుల్లో న‌మోదైన ఆస్తుల విలువ‌ల‌నే తాను రాసిన‌ట్లుగా చెప్పారే. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో 2014 ఎన్నిక‌ల్లో మార్కెట్ విలువ ప్ర‌కార‌మే ఆస్తుల విలువ‌ను కోట్ల‌ల్లో న‌మోదు చేసిన‌ట్లుగా చెప్పారు.

2014 నాటికి తాను బ్యాంక్ లోను తీసుకొని బంజారాహిల్స్ లోని స్థ‌లంలో ఇల్లు క‌ట్టుకున్నాన‌ని.. త‌న‌కు రాష్ట్రంలో ప‌లు చోట్ల భూములు ఉన్నాయ‌న్న‌ది కూడా ప్ర‌మాణ ప‌త్రాల్లో పేర్కొన్న‌ట్లు చెప్పారు. తాను పేర్కొన్నవి త‌ప్పించి త‌న‌కు ఎలాంటి ఆస్తులు లేవ‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్‌.

తాను పేర్కొన్న‌వి కాకుండా.. త‌న స్వ‌గ్రామంలో ప‌ది.. ప‌న్నెండు ఎక‌రాల భూమిని మాత్రం కొన్న‌ట్లుగా రేవంత్ వెల్ల‌డించారు. త‌న‌కున్న నాలుగు అంత‌స్తుల భ‌వ‌నంపై అంత‌స్తుల‌ను ఎప్ప‌టి నుంచో ప్రైవేటు కంపెనీలు.. వ్యాపారాలు చేసుకునే వారికి అద్దెకు ఇస్తున్న‌ట్లు చెప్పారు. ఇంటి అడ్ర‌స్ పై వారు కంపెనీల‌ను రిజిస్ట్రేష‌న్లు చేసుకున్నార‌ని.. వాటిలో కొన్ని న‌ష్ట‌పోయి మూత‌ప‌డి ఉండొచ్చ‌న్నారు.

తాను కేవ‌లం ఇంటి య‌జ‌మానిని మాత్ర‌మేన‌ని.. రిజిస్ట‌ర్ ఆఫ్ కంపెనీస్ వెబ్ సైట్లో ఇంటి అడ్ర‌స్ ను వెతికితే.. ఎన్ని కంపెనీలు త‌న అడ్ర‌స్ మీద రిజిస్ట‌ర్ చేసుకున్న వైనం తెలుస్తుంద‌న్నారు. వాటి డైరెక్ట‌ర్లు ఎవ‌రో కూడా తెలుస్తుంద‌న్నారు. త‌న గురించి.. త‌న ఆస్తుల గురించి త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న రేవంత్‌.. త‌న మామ ప‌ద్మ‌నాభ‌రెడ్డి కోటీశ్వ‌రుడ‌న్న విష‌యాన్ని గుర్తు చేవారు.

మాడ్గుల మండ‌లంతో త‌న మామ తండ్రి దుర్గారెడ్డి 1940ల‌లోనే కోటీశ్వ‌రుడ‌ని.. త‌న పెళ్లికి ముందే త‌న మామ‌కు బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ ల‌లో ఆస్తులున్న విష‌యాన్ని గుర్తు చేశారు. ఆగ‌ర్భ శ్రీ‌మంతులైన త‌న మామ‌ను త‌న‌కు బినామీలుగా సృష్టిస్తున్నార‌ని.. ప‌ద్మ‌నాభ‌రెడ్డి.. స్వ‌ప్నారెడ్డి.. జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డిల ఆస్తులు ఎంత‌? వారి వ్యాపారాలు ఏమిటో చెక్ చేసుకోవాల‌ని ఆయ‌న స‌వాలు విసురుతున్నారు. మొత్తంగా తన ఆస్తుల మీద వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పైనా రేవంత్ ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.