Begin typing your search above and press return to search.
రేవంత్ తో కేటీఆర్ అలా.. ఎర్రబెల్లి ఇంకోలా
By: Tupaki Desk | 29 March 2016 7:38 AM GMTఆ ఇద్దరూ పవర్ ఫుల్ నేతలే.. తమ తమ పార్టీలకు తురుపుముక్కలే. ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. కాకపోతే, ఒకరి పార్టీ ఫుల్ స్వింగులో ఉంటే ఇంకొకరి పార్టీ కష్టాల్లో ఉంది. నిత్యం ఒకరినొకరు విమర్శించుకుంటూ వార్తల్లో ఉంటారు. అలాంటి నేతలిద్దరూ ఎదురెదురు పడితే ఎలా ఉంటుందన్నది అందరికీ ఆసక్తికరమే. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో అలాంటి దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి - తెలంగాణ మంత్రి కేటీఆర్ లు ఎదురెదురు పడ్డారు. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలు అక్కడున్నవారికి ఆసక్తి కలిగిచాయి.
సోమవారం అసెంబ్లీ లాబీల్లోని లిఫ్టు దగ్గర రేవంత్ వెయిట్ చేస్తున్న సమయంలో అక్కడికి మంత్రి కేటీఆర్ వచ్చారు. రేవంత్ ను చూసిన వెంటనే.. ''ఏం భాయ్ స్ర్టేటజిక్ గా వెళుతున్నట్లున్నావే?"" అంటూ నవ్వుతూ పలుకరించారు. వెంటనే రేవంత్ కూడా.. ''స్ట్రాటజీ లేకపోతే ఎలా అన్నా?" అంటూ బదులిచ్చారు. దీంతో కేటీఆర్ నవ్వుతూ రేవంత్ భుజం తట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరదాగా సాగిన ఈ సన్నివేశాన్ని అంతా బాగా ఎంజాయ్ చేశారు. రాజకీయంగా ఎన్ని అనుకున్న వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు ఇలా సరదాగా ఉండడం మంచి పరిణామమే.
కాగా మరోవైపు కొద్దికాలం కిందట వరకు టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకరరావు ఎదురైనప్పుడు మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. రేవంత్ ఉన్న ప్రాంతంవైపు ఎర్రబెల్లి దయాకర్ వస్తుండటంతో, రేవంత్ ఆయన్ని ఆహ్వానించారు. ఎర్రబెల్లి మాత్రం పక్కనే ఉన్న హరీశ్ రావు కార్యాలయంలోకి వెళ్లేందుకు చూశారు. అక్కడ ఎవరూ లేరని తెలుసుకుని, చిరునవ్వుతో నమస్కారం చేస్తూ ఆగకుండా హాల్ లోకి వెళ్లిపోయారు. దీంతో అక్కడున్న వారు రేవంత్, కేటీఆర్ వైఖరిని ప్రశంసిస్తూ ఎర్రబెల్లి తీరును చూసి మాత్రం నవ్వుకున్నారు.