Begin typing your search above and press return to search.
సోనియాతో రేవంత్ విత్ ఫ్యామిలీ..మ్యాటరేంటో?
By: Tupaki Desk | 3 Sep 2019 3:04 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ కు ఆశాదీపంగా కనిపిస్తున్న ఆ పార్టీ యువనేత - మల్కాజిగిరి ఎంపీ - టీ పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనదైన శైలి వ్యూహాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో ప్రత్యక్షమైన రేవంత్ రెడ్డి... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రేవంత్ ఒక్కరే వెళ్లి సోనియాతో భేటీ అయితే దానికి అంతగా స్పెషల్ అటెన్షన్ వచ్చేది కాదు గానీ... రేవంత్ మొత్తం తన ఫ్యామిలీతో కలిసి సోనియాతో బేటీ అయ్యారు. అయినా రేవంత్ ఫ్యామిలీ అంటే ఎవరెవరంటే... రేవంత్ రెడ్డి - ఆయన భార్య - ఇటీవలే పెళ్లి చేసుకున్న కూతురు - అల్లుడు... మొత్తం నలుగురు కలిసి సోనియాతో భేటీ అయ్యారు. సోనియాతో ఈ నలుగురు కలిసి తీయించుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కదా... అంతేగాక ఇప్పుడప్పుడే అక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితి కూడా లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిన రేవంత్... సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. దీంతో అప్పటిదాకా ఎమ్మెల్యేగానే సత్తా చాటిన రేవంత్... ఇప్పుడు ఓ ఎంపీగా జాతీయ స్థాయి పాలిటిక్స్ కు వెళ్లిపోయారన్న మాట వినిపిస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ ఓటమితో అందరూ సైలెంట్ అయిపోతే... రేవంత్ ఒక్కరే తాను పార్టీని నిలబెడతానన్న రీతిలో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన తన ఫ్యామిలీతో కలిసి సోనియాతో భేటీ అయి అందరి దృష్టిని ఆకర్షించారు.
పార్టీకి పునరుజ్జీవం తీసుకొచ్చే రీతిలో తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తానంటూ రేవంత్ ఇటీవల చేసిన ప్రకటన గుర్తుంది కదా. అంటే గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర లాంటిదన్న మాట. నాడు వైఎస్ చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగా... ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే రేవంత్ ఈ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే అధిష్ఠానం నుంచి ఇప్పటిదాకా ఈ యాత్రకు అనుమతి లాంటి ప్రకటనలేమీ రాలేదు. ఈ విషయంపై చర్చించేందుకే రేవంత్ సోనియాను కలిశారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే... పాదయాత్రకు అనుమతి రాకపోగా... ప్రఃస్తుతం కేంద్రంలోని బీజేపీ సర్కారు నల్లమల ఫారెస్ట్ లోని విలువైన యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేసింది. ఈ తవ్వకాల వల్ల తెలంగాణలో రెండు జిల్లాలు బాగా నష్టపోతాయని వాదిస్తున్న రేవంత్... అటు కేంద్రంలోని బీజేపీ సర్కారుతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేసిన కేసీఆర్ సర్కారుపైనా యుద్ధం చేస్తానని కూడా రేవంత్ ప్రకటించారు. ఇప్పటికే ఈ దిశగా రేవంత్ తన కార్యాచరణను కూడా ప్రారంభించారనే చెప్పాలి. యురేనియం తవ్వకాలపై రేవంత్ పోరాటానికి కూడా పార్టీ అధిష్ఖానం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి మాటా రాలేదు. ఈ నేపథ్యంలో పాదయాత్రకైనా అనుమతి ఇవ్వండి, లేదంటే పార్టీ తరఫున యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాను చేపడుతున్న పోరాటానికి అనుమతి ఇవ్వండని కోరేందుకే రేవంత్ రెడ్డి... సోనియాతో భేటీ అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కారణమేదైనా ఫ్యామిలీతో కలిసి ఢిల్లీ వెళ్లిన రేవంత్ నేరుగా సోనియాతోనే భేటీ కావడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.