Begin typing your search above and press return to search.
టాటా.. బిర్లా.. అంబానీల ప్రస్తావన రిథమే కానీ సీరియస్ నెస్ మిస్ రేవంత్
By: Tupaki Desk | 10 Aug 2021 4:40 AM GMTమాటలు ఎవరైనా చెబుతారు.కానీ.. కొందరు చెప్పే మాటలకున్న ప్రభావం అంతా ఇంతా కాదు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యమ నాయకుడిగా.. పార్టీ అధినేతగా ఆయన మాటలు తెలంగాణ ప్రజల్ని ఎంతలా కదిలించాయంటే.. దశాబ్దాల తరబడి పెండింగ్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు అయ్యేలా చేసింది. ఏదైనా ఇష్యూను టేకప్ చేసినప్పుడు.. దాన్నిసూటిగా.. స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయాలో తప్పించి.. మధ్యలో పక్కదారి పట్టకూడదు.
ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అస్సలు తప్పు చేయరు. రాజకీయంగా తాను టార్గెట్ చేసే వారిపై ఘాటు విమర్శలు చేయటమే కాదు.. అది వారి ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి.. పదునైన మాటలు.. ఆసక్తి కలిగించే పిట్టకథలతో పాటు.. ప్రత్యర్థుల్ని ఊపిరి తీసుకోలేని రీతిలో మంట పుట్టేలా మాట్లాడటంలో రేవంత్ దిట్ట. ఆ విషయంలో ఆయన్ను ఎవరూ వేలెత్తి చూపించలేరు. కాకుంటే.. మాటల విషయంలో కేసీఆర్ తో రేవంత్ ను పోల్చిన వెంటనే వచ్చే అభ్యంతరం.. విశ్వసనీయత మాట.
ఆ మాటకు వస్తే.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటలు అందరిని ఆకట్టుకున్నా..ఆయనపై విశ్వసనీయత విషయంలో ఇప్పుడు రేవంత్ మీద ఎలాంటి సందేహాలు ఉండేవో అలాంటివే ఉండేవి. కాకుంటే.. కాలం కలిసి రావటంతో ఆయన మీద ఉన్న అపోహల స్థానే.. నమ్మకం ఎక్కువైంది. చివరకు తెలంగాణ రాష్ట్రానికి తిరుగులేని అధినేతగా అవతరించారు.
కేసీఆర్ మాదిరే తాను కూడా తిరుగులేని నేతగా మారాలన్నదే రేవంత్ లక్ష్యం. ఇలాంటివేళ.. నోటి నుంచి వచ్చే మాటలు సూటిగా ఉండాలే కానీ.. ప్రాస కోసమో.. రిథమో కోసమో పక్కదారి పట్టేలా.. వేలెత్తి చూపించేలా మాటలు ఉండకూడదు. ఈ విషయంలో రేవంత్ తప్పులు చేస్తున్నారని చెబుతారు. ఇంద్రవెల్లి సభనే తీసుకుంటే.. కేసీఆర్ కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని.. వారి ఆస్తులు భారీగా పెరిగిపోయాయని ఆరోపించే క్రమంలో బిడ్డ బిర్లా.. అల్లుడు అంబానీ.. కొడుకు టాటా పేర్లను ప్రస్తావించారు. వినేందుకు రిథమ్ బాగానే ఉన్నా.. ప్రజల్లోకి ఇలాంటి మాటలు ఎక్కవన్న మాట వినిపిస్తోంది.
కారణం.. కొడుకు.. కూతురు అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఓకే కానీ.. వారికి మించినట్లుగా అల్లుడు (మేనల్లుడు) హరీశ్ ఉన్నట్లుగా చేసిన రేవంత్ మాటలు అతికినట్లుగా లేవన్న విమర్శ వినిపిస్తోంది. ఇప్పటివరకు కవిత.. కేటీఆర్ మీద అవినీతి ఆరోపణలు వినిపించాయి కానీ హరీశ్ మీద పెద్దగా ఆరోపణలు లేవు.ఇలా అతకని మాటల కారణంగా రావాల్సినంత మైలేజీ రాకపోవటమే కాదు.. సీరియస్ మాటల్ని సింఫుల్ గా తీసుకునే ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ విషయాన్ని రేవంత్ ఎప్పటికి గుర్తిస్తారో?