Begin typing your search above and press return to search.

సీఎస్‌ సోమేష్ కుమార్ పై.. రేవంత్ సంచ‌ల‌న ఆరోపణలు!

By:  Tupaki Desk   |   18 July 2021 2:30 AM GMT
సీఎస్‌ సోమేష్ కుమార్ పై.. రేవంత్ సంచ‌ల‌న ఆరోపణలు!
X
తెలంగాణ చీఫ్ సెక్రెట‌రీ రేవంత్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమేష్ కుమార్ కు అస‌లు చీఫ్ సెక్ర‌ట‌రీ అయ్యే అర్హ‌తే లేద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, సీఎస్ సోమేష్ చ‌ట్ట విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. క్యాట్ తీర్పున‌కు విరుద్ధంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విలో సోమేష్ కొన‌సాగుతున్నార‌ని అన్నారు.

సోమేష్ కుమార్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేడ‌ర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ అని రేవంత్‌ అన్నారు. ఆయ‌న ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీగా ఉన్న‌ప్పుడు 8 సంవ‌త్స‌రాలపాటు స‌ర్వీస్ వ‌దిలేసి ప్రైవేటు కంపెనీల్లో ప‌నిచేశార‌ని ఆరోపించారు. ఆయ‌న స‌ర్వీసు నుంచి ఆ 8 సంవ‌త్స‌రాల‌ను తొల‌గిస్తే.. సోమేష్ కు ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ హోదా ఇవ్వ‌డానికి కూడా చ‌ట్టం అనుమ‌తించ‌ద‌ని అన్నారు. అలాంటి సోమేష్ కుమార్ ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏకంగా చీఫ్ సెక్రెట‌రీని చేశార‌ని ఆరోపించారు.

రాష్ట్ర విభ‌జ‌న‌లో సోమేష్ కుమార్ ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు కేటాయించార‌ని రేవంత్ అన్నారు. త‌న‌ను తెలంగాణ‌లోనే ఉంచాల‌ని కోరుతూ సోమేశ్ కుమార్ క్యాట్ ను ఆశ్ర‌యించార‌ని చెప్పారు. కానీ.. సోమేశ్ కుమార్ అభ్య‌ర్థ‌న‌ను క్యాట్ కొట్టేసింద‌ని, ఖ‌చ్చితంగా ఏపీకి వెళ్లాల‌ని తీర్పు చెప్పింద‌ని కూడా రేవంత్ తెలిపారు. అయితే.. సోమేశ్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నార‌ని తెలిపారు.

కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాని, అయినా.. ఆ కేసు కోర్టు బెంచ్ ముందుకు రాలేదు అని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ.. ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు సోమేష్ కుమార్ పై మొత్తం 298 కోర్టు ధిక్క‌ర‌ణ కేసులు ఉన్నాయ‌ని రేవంత్ రెడ్డి అన్నారు.