Begin typing your search above and press return to search.
బాబును ఎందుకు ఇబ్బందులు పెడ్తావ్ రేవంత్?
By: Tupaki Desk | 27 Feb 2016 12:01 PM GMTతెలుగుదేశం పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి దూకుడు ఒక్కోసారి ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతుందనడంలో సందేహం లేదేమో. వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్ ఈ సందర్భంగా ఉద్వేగంగా మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ముసుగుదొంగలు ఎవరో బయటపడ్డారని ఆయన ఎర్రబెల్లి దయాకరరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 32 ఏళ్ల పాటు పెంచి పోషించిన తెలుగుదేశం పార్టీకి ఎర్రబెల్లి ద్రోహం చేశారని, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన రీతిలో వ్యవహరించారని విమర్శించారు.
తన కోసం ప్రాణా త్యాగాలు చేసిన కార్యకర్తల గుండెలపై తన్నిన ఎర్రబెల్లికి రాజకీయాలలో కొనసాగే అర్హత లేదనీ, కేసీఆర్ ఫామ్ హౌజ్ లోవాచ్ మెన్ ఉద్యోగం చేసుకోవాలని సలహా ఇచ్చారు. తెలుగుదేశం టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లిని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన భవనంలో ఉంటున్న ఎర్రబెల్లి దానిని వెంటనే ఖాళీ చేయాలని కోరారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాళ్లకు పుట్టగతులుండవని చెప్పిన ఎర్రబెల్లి ఆటలు ఇంకెంతో కాలం సాగవని హెచ్చరించారు. వరంగల్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ డిమాండ్ లో లాజిక్ ఉన్నప్పటికీ ఏపీలో ఇబ్బందిగా మారుతుందని రాజకీయవర్గాలు అంటున్నారు. ఏపీలో సైకిలెక్కించుకున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని వైసీపీ ఇప్పటికే డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కోరిన చంద్రబాబు అదే సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్‌కు కూడా వ్యవహరించాలని ఎందుకు చూడరని నిలదీస్తోంది. ఈ పిరాయింపుల విషయంలో టీడీపీ ముఖ్యనేత పయ్యావుల కేశవ్ కు, వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మధ్య సవాల్ పర్వం కొనసాగుతోంది. వరంగల్‌లో కార్యకర్తలకు ఊపు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఘాటు స్పీచు ఇవ్వడంలో తప్పేమీలేనప్పటికీ అది బాబుకు ఇరకాటంగా మారుతుందనేది చూసుకోవాల్సిన అవసరం ఉందేమో.