Begin typing your search above and press return to search.
రేవంత్ మాట: ఆట కాదు వేట మొదలైంది
By: Tupaki Desk | 9 Sep 2015 9:34 AM GMTతెలంగాణ టీడీపీ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో టీఆర్ ఎస్, కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఓటుకునోటు కేసులో బెయిల్ సడలింపులు దొరికిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ కు చెందిన టీఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు రేవంత్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
సింహంలా తాను సింగిల్ గా హైదరాబాద్ వస్తుంటే కేసీఆర్ భయపడి చైనాకు వెళ్లాడని ఎద్దేవాచేశారు. ‘మొదలైంది ఆట కాదు..వేట’ అని రేవంత్ హెచ్చరించారు. బంగారు తెలంగాణ చేస్తాడని కేసీఆర్ ను గెలిపిస్తే.. తాగుబోతుల తెలంగాణ తెచ్చాడని మండిపడ్డారు. కేసీఆర్ నియంతృత్వ విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానని కేసీఆర్ మాట్లాడుతున్నారని...తమ పార్టీ ఏమీ మందు సీసా కాదు ఖాళీ చేయడానికి అంటూ సెటైర్ వేశారు. హైదరాబాద్ లో టీడీపీ జెండాలు ఉండకూడదంటూ జీహెచ్ ఎంసీ కమిషనర్ ప్రయత్నం చేస్తున్నారని...తాము తల్చుకుంటే ఒక్కగంటలో నగరంలో టీఆర్ ఎస్ జెండాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.
100 ఎకరాల తన ఫామ్ హౌస్ కోసం వందసార్లు ఏం పంట వేయాలి..ఏం చేయాలి అని ఆలోచిస్తున్న కేసీఆర్ రాష్ర్టం కోసం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ చలించడం లేదని ...రాక్షసానందాన్ని పొందుతున్నారని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఎందుకు ప్రయత్నం చేయడం లేదని నిలదీశారు. పెట్టుబడుల కోసం చైనా పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. ఆర్థిక మంత్రిని ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు.