Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అంట..!
By: Tupaki Desk | 2 July 2015 5:08 AM GMTబహిరంగ సభలో కానీ.. మీడియాతో మాట్లాడే సమయంలో తమ రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి నాలుగు మాటలు అనటం.. వీలైతే వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటే. తిట్టాల్సిన తిట్లు అన్నీ ములాజ లేకుండా తిట్టేయటం ఆయనకు అలవాటే. అవసరమైతే కాస్త డోస్ పెంచి మరీ విమర్శలు చేస్తుంటారు.
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి.. నెల రోజులు జైలు జీవితం గడిపిన టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి బెయిల్ మీద విడుదలైన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కొన్ని మాటలు పదే పదే వచ్చాయి. మాటల్లో తిట్లు ఉండటం మామూలే. అందుకు భిన్నంగా తిట్లే మాటలుగా మారినట్లుగా రేవంత్ మాట్లాడారు.
''సన్నాసులు.. చవటలు.. వెధవలు.. బద్మాష్‌లు...'' లాంటి పదాల్ని విరివిగా ఉపయోగించిన రేవంత్ రెడ్డి.. తనపైనా.. తన పార్టీపైనా విమర్శలు చేస్తున్న మంత్రులను ఉద్దేశించి.. వారి పేర్లు ప్రస్తావించకుండా.. ''ఆలుగడ్డలవాడు.. గోచి పెట్టుకునేవాడు.. అమ్మలాంటి పార్టీని అమ్ముకునేవాడు.. లంబూ'' అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆలుగడ్డలవాడు.. లంబూగాడు లాంటి వారిని ఉద్దేశించి ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటంతో పాటు.. ఏక వచనంలో పలుమార్లు విరుచుకుపడ్డారు.
రేవంత్ ప్రసంగంపై ఒక టీటీడీపీ నేత వ్యాఖ్యానిస్తూ.. రేవంత్ నోటిని మూసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారనటానికి తాజా ప్రసంగమే నిదర్శనం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి.. మాట్లాడటమే కాదు.. అవసరమైతే ఆయనకు మించిన స్థాయిలో మాట్లాడే సోయి రేవంత్‌ది. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేసీఆర్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ ఎవరంటే.. రేవంతేనని వ్యాఖ్యానించారు. నిజమేనంటారా?