Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో క‌లిసి మోడీ ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   3 Feb 2022 12:30 AM GMT
కేసీఆర్ తో క‌లిసి మోడీ ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారా?
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఖ‌చ్చితంగా ఎవ‌రూ జోస్యం చెప్ప‌లేరు. బద్ద‌శ‌త్రువులు అనుకున్న వారి మ‌ధ్య దోస్తీ కుదురుతుంది. గొప్ప మిత్రులు అనుకున్న వారి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇలాంటి ప‌రిస్థితే తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చింద‌నుకోవ‌చ్చు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గురించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం అధ్య‌క్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు, అంతేకాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ గురించిన చేసిన విమ‌ర్శ ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో భాగంగా చూడ‌వ‌చ్చ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదని ఆయ‌న తేల్చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినందుకు రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని ఆయ‌న ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ గంటన్నర ఉంటే కేసీఆర్ రెండున్నర గంటలు ఏకపాత్రాభినయం చేస్తూ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడార‌ని ఎద్దేవా చేశారు. తెలంగాణ విభజన అంశాలకు బడ్జెట్ లో కేటాయింపులు లేనందున మోడీపై యుద్ధం ప్రకటిస్తారని ఆశించ‌గా కల్తీ మందు తాగి వచ్చినట్లు మాట్లాడారని రేవంత్ క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు.

బీజేపీ త‌న ఎజెండాను తెలంగాణ సీఎం కేసీఆర్ రూపంలో వ్య‌క్తం చేసింద‌ని రేవంత్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కేసీఆర్ ప్ర‌క‌టించ‌డం ద్వారా భూస్వాములు,అగ్ర వర్ణాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ మాటలను కేసీఆర్ మాట్లాడినట్లు ఉందని రేవంత్ అనుమానం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగం రద్దు చేయాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా కుట్ర చేస్తుంది. ``కేసీఆర్ ను ముందుంచి రాజ్యాంగం రద్దు అంశాన్ని తెరమీదికి తెచ్చారు. బీజేపీ రాజ్యాంగం రద్దు కుట్రకు కేసీఆర్ మద్దతు తెలిపినందున అన్ని జిల్లా,మండల కేంద్రాల్లో అంబెడ్కర్ విగ్రహం ముందు కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్దం చేయాలి. కేసీఆర్ రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకునేందుకు రెండు రోజుల పాటు గాంధీ భవన్ లో నిరసన దీక్షలు చేప‌ట్ట‌నున్నాం. రాజ్యాంగం రద్దు ఆలోచనను ఉపసంహరించుకొకపోతే దేశ యువత కేసీఆర్ నాలుక కొస్తారు`` అని రేవంత్ విరుచుకుప‌డ్డారు.