Begin typing your search above and press return to search.

ప్రసంగం పేరుతో ఎంత పచ్చిగా తిట్టేశారంటే..!

By:  Tupaki Desk   |   2 July 2015 5:10 AM GMT
ప్రసంగం పేరుతో ఎంత పచ్చిగా తిట్టేశారంటే..!
X
ఓటుకు నోటు కేసులో విడుదలైన రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ తెలంగాణ అధికారపక్షాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగం మొత్తాన్ని తెలంగాణ అధికారపక్షంపై నిప్పులు కురిపించారు. సమీప భవిష్యత్తులో ఇంత దారుణంగా తిడుతూ మాట్లాడిన నేత ఎవరూ లేరన్నట్లుగా ఆయన ప్రసంగించారు. రేవంత్‌ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు.. నిప్పు కణికలు అన్న చందంగా ఆయన ప్రసంగించారు.

తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మొదలుకొని.. పలువురు మంత్రులపై ఆయన ప్రత్యక్ష పరోక్ష వ్యాఖ్యలు చాలానే చేశారు. హాట్‌.. హాట్‌గా సాగిన ఆయన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల్ని చూస్తే..

''బిడ్డా కేసీఆర్‌.. వస్తున్నా. నాకు బెయిల్‌ వచ్చింది. కేసీఆర్‌కు లాగు తడుస్తోంది. కేసీఆర్‌ నేర చరిత్ర తెలిసిన వారు కొంతమంది జైలులో కలిశారు. కేసీఆర్‌ బండారం బయటపెడతా. నిన్న నాకు బెయిల్‌ వచ్చింది. కేసీఆర్‌కు జ్వరం రావటమే కాదు.. లాగు తడుస్తోంది. కేసీఆర్‌లో ప్రవహించేది తెలంగాణ రక్తమే అయితే.. ఇతర పార్టీ నుంచి చేర్చుకున్న సన్నాసుల చేత రాజీనామా చేయించాలి. వారిని తిరిగి ఎన్నికల్లో గెలిపించుకుంటే నాలుగేళ్లు తెలంగాణలో మా పార్టీ జెండా ఎగురవేయం. అదే టీఆర్‌ఎస్‌ ఓటమిపాలైతే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నేలకు ముక్కు రాస్తారా?''

''టీడీపీని అంతం చేస్తానన్న వ్యక్తి పావురాల గుట్టలో కలిసిపోయాడు. తెలంగాణలో టీడీపీని భూస్థాపితం చేస్తానని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే కేసీఆర్‌.. ఏబీఎన్‌.. టీబీ9 గొంతు నొక్కిన సంగతి మర్చిపోయాడా? తన సొంత ఛానెల్‌ని ఆయుధంగా చేసుకొని విమర్శలు చేస్తూ.. అవాకులు.. చవాకులు ప్రసారం చేయలేదా? ఈ సన్నాసులంతా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. తాగుబోతోడి పక్కన చేరి నాటకాలాడుతున్నారు. మందులోకి సోడా పోసినోళ్లంతా మంత్రులయ్యారు''

''ఒకడైతే మోండా మార్కెట్‌లో ఆలుగడ్డలు అమ్ముకునేటోడు. ఇంకోడు అమ్మ లాంటి పార్టీని తెగనమ్ముకునేటోడు.. ఖమ్మమోడు. మూడోవాడు వాడి అయ్యను కూడా చెప్పకోనోడు.. వరంగలోడు.. ఇంకొకకుడు ఉన్నాడు. పంచె కట్టుకొని రైతులకు గోతులు తవ్వుతుంటోడు.. నిజామాబాద్‌ జిల్లావాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో వాడు మంత్రిగా ఉంటే లక్ష రూపాయిలు లంచం తీసుకుంటే.. గోసి ఊడదీసి మంత్రి పదవి నుంచి తీసేసి రోడ్డు మీద నిలబెట్టిండు చంద్రబాబునాయుడు. ఈ సన్నాసులందరూ చంద్రబాబునాయుడ్ని ప్రశ్నిస్తున్నరు''