Begin typing your search above and press return to search.
కావేరీకి.. కేసీఆర్ కూ లింకెట్టిన రేవంత్
By: Tupaki Desk | 29 Aug 2016 5:25 AM GMTమహారాష్ట్ర సర్కారుతో ‘మహా’ ఒప్పందం కుదర్చుకున్న తర్వాత బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీఆర్ ఎస్ శ్రేణుల నుంచి ఎంత భారీగా స్వాగత సత్కారాలు లభించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను సాధించింది మామూలు విజయం కాదన్నట్లుగా ఉన్న టీఆర్ ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్రతో జరిగిన చారిత్రక ఒప్పందం గురించి చెప్పటమే కాదు.. తమ ప్రభుత్వం మీద ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసే వారిపై కేసులు పెడతామని.. జైలుకు పంపుతామంటూ భారీ హెచ్చరికనే చేసేశారు. కేసీఆర్ హెచ్చరికపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. ఇది జరిగి వారం కూడా కాకముందే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర ఆరోపణల్ని సంధించారు.
మెదక్ జిల్లా పాములపర్తి వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ నీటి సామర్థ్యాన్ని భారీగా తగ్గించారంటూ ఆయన ఆరోపించారు. నీటి సామర్థ్యం తగ్గింపు వెనుక ప్రభుత్వం కుట్రకు పాల్పడిందని.. ఒక విత్తన కంపెనీకి సంబంధించిన భూముల్ని కాపాడేందుకే తెలంగాణ సర్కారు రిజర్వాయర్ నీటి సామర్థ్యాన్ని తగ్గించినట్లుగా ఆరోపించారు. ఈ రిజర్వాయర్ ను తొలుత ఒక టీఎంసీ నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించారని.. ఆ తర్వాత దీన్ని 21 టీఎంసీలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
ఇలా ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీల సామర్థ్యానికి పెంచిన రిజర్వాయర్ ను తాజాగా 7 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి పరిమితం చేయటం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కావేరీ విత్తర కంపెనీకి చెందిన భూముల్ని కాపాడేందుకే ఈ ప్రయత్నం చేస్తున్న ఆయన ఆరోపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ ఎన్నికల ఖర్చును కావేరీ సీడ్స్ కంపెనీనే భరించిందంటూ భారీ ఆరోపణే చేశారు. కావేరీ విత్తన సంస్థ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బంధువు అవుతారని రేవంత్ వెల్లడించారు.
ఓపక్క మల్లన్నసాగర్ నిర్మాణంతో 14 గ్రామాల్లోని 21 వేల ఎకరాలు మునిగిపోతాయని ప్రజలు ఆందోళన చేస్తుంటే నీటి సామర్థ్యం తగ్గించని తెలంగాణ సర్కారు.. పాములపర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యాన్నిఎందుకు తగ్గిస్తున్నారో వెల్లడించాని ఆయన మండిపడ్డారు. పాములపర్తి రిజర్వాయర్ మీద తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే తనపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. మరి.. రేవంత్ తాజా ‘కావేరీ’ ఆరోపణలపై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.