Begin typing your search above and press return to search.
కేసీఆర్ రికార్డ్..రాష్ట్రం పుట్టకముందు తేదీతో జీవో!
By: Tupaki Desk | 29 Dec 2016 1:54 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలను నిశితంగా విమర్శించే టీడీఎల్సీ నేత ఎ. రేవంత్ రెడ్డి మరోమారు అదే రీతిలో స్పందించారు. ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన భూసేకరణ చట్టం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...2014 జనవరి 1 నాటికి అసలు తెలంగాణ రాష్ట్రమే లేకపోగా అప్పటి నుంచి అమలయ్యేలా ప్రభుత్వం కొత్త భూ సేకరణ చట్టాన్ని తెచ్చిందన రేవంత్ రెడ్డి తెలిపారు. అసలు ఒక రాష్ట్రం చెలామణిలోనే లేనపుడు...ఈ విధంగా జీవో తేవడం ఎలా సాధ్యం అవుదతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జీవోలతో పేదల జీవితాలతో ఆటలాడుతున్న రాష్ట ప్రభుత్వం భూ సేకరణ పేరుతో భూ కబ్లాకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. తాజాగా ఆయన ఈ మేరకు టీఆర్ ఎస్ సర్కారుపై మండిపడ్డారు.
రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని గుజరాత్ తరహా చట్టంగా చెప్తున్నారని అయితే ఇది గుజరాత్ తరహా చట్టం కూడా కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్టం 2014 జూన్ 2వ తేదీన ఏర్పడగా ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త భూ సేకరణ చట్టం 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా ఈ బిల్లులో పేర్కొనడంపై రేవంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు రాష్టమే లేనపుడు చట్టం ఏలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆమాత్రం కూడా తెలివిలేకుండా తమకు బలము ఉందని, ఏది అనుకుంటే అది చట్టంగా చేయడం ఎంతవరకు సమంజసం అని రేవంత్ రెడ్డి నిలదీశారు. రాష్ట శాసనసభ స్పీకర్ చట్టాల ప్రకారంగా తన ధర్మాన్ని నిర్వర్తించాలంటే రాష్టం పట్టకముందు నుంచే అమల్లో ఉన్నట్లుగా మోసపూరితమైన చట్టాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పై సభాహక్కుల ఉల్లంఘన చట్టం కింద చర్యలను తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర చట్టాన్ని సవరించే అధికారం లేకున్నా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ చట్టాన్ని కాలరాశారని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతో అధ్యయనం చేసి అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను సేకరించి దేశంలో రైతులందరి సంక్షేమం కోసం 2013 భూ సేకరణ చట్టాన్ని తీసుకొచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం తెచ్చిన భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూనే ఉందని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా 2015 లో జీవో నెం.123 - 254లను తీసుకొచ్చిందని - మళ్లీ 2016 లో జీవో నెం. 190 - 191లను తీసుకొచ్చిందని వివరించారు. అయితే ఈ జీవోలలో నిర్వాసితుల సంక్షేమానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని పలుమార్లు రాష్ట్ర హైకోర్డు మొట్టికాయలు వేసిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలో పోలీసుల సహాయంతో రైతులను బెదిరించి కర్ఫ్యూ- నిషేదాజ్ఞలాంటివి విధించి రైతుల నుంచి నిర్బంధంగా భూములను లాక్కున్న ప్రభుత్వంపై పలువురు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, ఇప్పటికీ నిరసన దీక్షలు కూడా ఆ ప్రాంతంలో కొనసాగుతున్నాయని రేవంత్ చెప్పారు. రైతుల భూములను చౌకగా లాక్కోవడానికి తాము చేస్తున్న ప్రయత్నం విఫలం కావడంతో అడ్డదారిలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. ఈ కొత్త చట్టాన్ని 2013 భూ సేకరణ చట్టానికి సవరణగా ప్రభుత్వం చెప్తుందని, అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి సవరణలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనేలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
2013 భూ సేకరణ చట్టంలో ఒకటికంటే ఎక్కువ పంటలు పండే భూములను సేకరించకూడదని నిబంధనలు ఉండగా వాటిని తొలగించి ఎన్ని పంటలు పండే భూములనైనా సేకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని చట్ట సవరణ చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగా డీపీఆర్ లేకుండానే ఎలాంటి చట్టం లేకుండా కేవలం సంప్రదింపుల ద్వారా కలెక్టకర్లు అనుకున్న ధరకు భూములు సేకరించవచ్చునని కొత్త చట్టంలో పేర్కొన్నారని ఇది ఆత్మహత్య సదృశమే అవుతుందని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చింది భూ సేకరణ చట్టం కాదని, పేదల భూముల కబ్దా చట్టమని విమర్శించారు. ఇది వరకు జీవోలతో చట్టాలు చేసి హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న తరువాత ఈ దిక్కుమాలిన చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. కొత్త భూ సేకరణ చట్టం బిల్లను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అధికారం లేకున్నా పార్లమెంట్ చట్టానికి సవరణ చేయడం రాష్ట్రం పుట్టక ముందే చట్టం పట్టినట్లుగా బిల్లను రూపొందించడం తదితర అంశాలపై రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఫిర్యాదులు చేస్తామని ప్రకటించారు. భూ నిర్వాసితులు అధైర్య పడాల్సిన పడాల్సిన అవసరం లేదని వారికి టీడీపీ అండగా ఉంటుందని, ఈ చట్టాన్ని అడ్డుకోవడానికి తాము ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని రేవంత్ ప్రకటించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/