Begin typing your search above and press return to search.
తాగుబోతుల రాజ్యంగా తెలంగాణ
By: Tupaki Desk | 7 Aug 2015 4:58 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉప్పునిప్పుగా ఉండే టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తాజాగా ఆయన్ను టార్గెట్ చేస్తూ మరో విమర్శ చేశారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలకు యదేచ్ఛగా అనుమతిలిస్తూ కేసీఆర్ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు.. బంగారు తెలంగాణ అంటే తాగుబోతులను తయారు చేయడమా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అంగన్వాడీ, ఒప్పంద ఉద్యోగుల సమ్మె తో పరిపాలన కుంటుపడిందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెస్ బిల్లులు రూ.7 కోట్లు చెల్లించక పోవడంతో మెస్ లు మూతపడి విద్యార్థులు నానా ఇక్కట్లకు గురవుతున్నా కేసీఆర్ కు పట్టదా అని ప్రశ్నించారు. ఓ వైపు బిల్లులు చెల్లించక మెస్ మూతబడుతుంటే రూ.5 కోట్లతో సీఎం కొత్త కార్లు కొనుగోలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని నిరంజన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని...ఆయనకు ఎన్నికల్లో రెండుసార్లు పోటీచేసినా కనీసం డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఇంటిని ప్రభుత్వం కొనుగోలు చేసి స్మారక కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి కి సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెండింగ్ లో ఉందని, సమస్యను పరిష్కరించమంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని ఆవేదన చెందారు.