Begin typing your search above and press return to search.
విన్నారాః టీడీపీ ఒక్కటే తెలంగాణ పార్టీనట
By: Tupaki Desk | 31 Oct 2016 4:51 PM GMTతెలుగుదేశం హైదరాబాద్ లో పుట్టి ఆంధ్రప్రదేశ్ లోనూ - కేంద్రంలోనూ అధికారంలో ఉన్న తెలంగాణ పార్టీ తప్ప టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తున్నట్లు ఇతర రాష్ట్రాలలో పుట్టి తెలంగాణకు వచ్చిన పరాయి పార్టీ కాదని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవానికి తెలంగాణ వాదిగా చెప్పుకొనే కేసీఆర్ పగలోమాట - రాత్రి ఓ మాట మాట్లాడుతూ తెలంగాణ సంపదను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగానే తన సహజ శైలిలో ఆయన సీఎం కేసీఆర్ పై నిప్పులు కురిపించారు. ఎన్నికల సమయంలో పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేదన్నారు. దాని గురించి అడిగితే ఎర్రవెల్లి - నర్సాపూర్ గ్రామాలలో కట్టిన ఇళ్ల గురించే ఆయన చెబుతారన్నారు. అయితే అక్కడ మాత్రమే ఇళ్లు కట్టి రాష్ట్రమంతటికి చూపించడానికి కేసీఆర్ ఎర్రవెల్లికి సర్పంచ్ కాదు - నర్సాపూర్ కు ఎంపీటీసీ సభ్యుడు కూడా కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో మిగిలిన 11 వేల గ్రామాలలో ఎప్పుడు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టిస్తారో చెప్పాలని రేవంత్ నిలదీశారు. నిబద్ధత కలిగిన కార్యకర్తలతో ప్రజల పక్షాన నిలబడే తెలుగుదేశం పార్టీ అంటే కేసీఆర్ కు ఎనలేని భయమని అందుకే టీడీపీపై ఆంధ్రా పార్టీ అని టీడీపీ పై ముద్రవేసి తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను మాయచేసే ప్రయత్నం చేస్తున్నారని దూయబట్టారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇతర రాష్ట్రాలలో పుట్టి తెలంగాణకు వచ్చిన పరాయిపార్టీ కాదని - హైదరాబాద్ నడిగడ్డలో పుట్టి ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలోనూ - కేంద్రంలోనూ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సొంత పార్టీ అని రేవంత్ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఉన్నది కూడా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోనేనని గుర్తు చేశారు.
తమది తెలంగాణ పార్టీ, తాను తెలంగాణ వాదినని చెప్పుకునే కేసీఆర్ చర్యలను ప్రజలు గమనించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. ఈ మధ్యన జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికలలో 20 టికెట్లను కేసీఆర్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారికే ఇచ్చారని రేవంత్ వెల్లడించారు. జూబ్లిహిల్స్ ఫిలీంనగర్ లో అందరూ ఆంద్రావాళ్లే లేరని దాదాపు 25 వేల మంది పాలమూరు బిడ్డలు ఫిలీంనగర్ బస్తీల్లో నివసిస్తున్నారని అలాంటి వారికి కేసీఆర్ ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆంధ్రావాళ్లకు టికెట్లు ఇచ్చే టీఆర్ ఎస్ నిఖార్సయిన తెలంగాణ పార్టీ ఎలా అవుతుందని రేవంత్ నిలదీశారు. హైదరాబాద్ లో అతి పెద్దదైన మెట్రో సంస్థ ఎండీ రాజమండ్రికి చెందిన వారని - ఐటి విభాగానికి సీఈవో కృష్ణా జిల్లాకు సంబంధించిన వారని చెప్పారు. ఐటి మంత్రి కేటీఆర్ పక్కన ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా ఉండరని ఆయన చుట్టూ కేవలం ఆంధ్రా వాళ్లే ఉంటారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వద్దని రాజ్యసభలో పోడియం వద్ద గంటల తరబడి నిలబడి ఆందోళన సాగించిన కేవీపీకి సంబంధించిన కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్టులు ఎలా ఇస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్టం మొత్తంమీద 2 లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తే అందులో లక్షా 90 వేల కోట్ల కాంట్రాక్టులు కేవీపీకి చెందిన కంపెనీలకే కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణ వారికి కేవలం సబ్ కాంట్రాక్టులు ఇచ్చారే తప్ప ఒక్క కాంట్రాక్టును కూడా నేరుగా ఇవ్వలేదని ఆయన వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్లమంది ప్రజలందరి వివరాలను ఒక్క రోజుల్లో సమగ్ర సర్వే ద్వారా సేకరించిన కేసీఆర్ తెలంగాణ తొలి, మలి ఉద్యమాలలో అసువుబాసిన 1569 మంది అమరవీరుల వివరాలను 30 నెలలు అయినా తొలుసుకోకపోవడం ఆయన వైఖరికి తార్మాణమని పేర్కొన్నారు. కేసీఆర్ పగలంతా జై తెలంగాణ అంటూ రాత్రయితే నైతెలంగాణ అంటారని రేవంత్ ఎద్దేవా చేశారు. నాయకులను తయారు చేసే తెలుగుదేశం పార్టీ కేసీఆర్తో సహా ఆయన మంత్రులందరినీ తయారు చేసిందని - టీడీపీ లేకుంటే వారందరూ ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. ఏం చేస్తామో కాదు. ఏం చేశామో చెప్పండి తెలుగుయువత నాయకులు - కార్యకర్తలు పార్టీ సభ్యత్వంపై దృష్టి పెట్టాలని రేవంత్ కోరారు. గ్రామాలకు వెళ్లినప్పుడు రాష్ట్రంలో ఒక కుటుంబ పాలన కావాలా? లేక సామాజిక పాలన కావాలా? అనే విషయంగా చర్చ పెట్టాలని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/