Begin typing your search above and press return to search.

ఆంధ్ర, తెలంగాణ పదాలకు కాలం చెల్లిందట

By:  Tupaki Desk   |   5 Nov 2016 2:52 PM GMT
ఆంధ్ర, తెలంగాణ పదాలకు కాలం చెల్లిందట
X
తెలంగాణ టీడీపీ నేత - ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఇంకా ఆంధ్ర - తెలంగాణ సెంటిమెంటుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ప్రజలు ఆయన ట్రాప్ లో పడబోరని.. ఆ రెండు ప‌దాల‌కు కాలం చెల్లిపోయింద‌ని చెప్పారు. త‌మ పార్టీకి ఆంధ్రపార్టీ అని ముద్ర వేయాల‌ని టీఆరెస్ చూస్తోందని.. అలాంటప్పుడు కేసీఆర్‌ అమ‌రావ‌తికి వెళ్లి బిర్యాని ఎందుకు తినొచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని ఎవ‌రెన్ని ప్రచారాలు చేసుకున్నా త‌మ పార్టీ పుంజుకుంటుంద‌ని చెప్పారు. ఆంధ్ర - తెలంగాణ‌ అంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన‌ప్పుడ‌ల్లా ప్రజలేమీ ఊగిపోరని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రజలు ఇప్పుడు సోదరభావంతో ఉన్నారని చెప్పారు.

హామీల అమ‌లులో కేసీఆర్ సర్కారు విఫ‌లమయింద‌ని చెప్పారు. కేసీఆర్ డ‌బ్బులు ఇచ్చి స‌ర్వేలు చేయించుకుంటూ భ‌జ‌న కొట్టించుకుంటున్నారని అన్నారు. త‌మ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ర‌మ‌ణ‌తో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ - రాహుల్ గాంధీ ఎలాగో టీడీపీకి చంద్రబాబు - లోకేశ్‌ అలాగేన‌ని రేవంత్‌ రెడ్డి అన్నారు. బీజేపీకి అమిత్ షా - సమాజ్ వాదీ పార్టీకి ములాయం సింగ్ యాద‌వ్ అధ్యక్షుల‌ుగా ఉన్నట్లే త‌మ పార్టీకి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడుగా ఉన్నార‌ని ఆయ‌న చెప్పారు. తాను తెలంగాణ‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాద‌యాత్ర చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని, రైతుల స‌మ‌స్యల‌ను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తేవడానికి యాత్రం చేస్తున్నానన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/