Begin typing your search above and press return to search.
రేవంత్ ఫైర్: కేసీఆర్ బురిడీ బాబా
By: Tupaki Desk | 8 Nov 2017 4:29 AM GMTఅవును! టీడీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొంది.. ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డి హస్తం పార్టీలోనూ తన హవా ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కడిగేయడంలో ముందున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ చేయని కామెంట్లతో విరుచుకుపడుతున్నాడు. తాజాగా.. సీఎం కేసీఆర్ ను `బురిడీ బాబా` అంటూ సంచలన కామెంట్ చేశాడు. విషయంలోకి వెళ్తే.. మంగళవారం మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ లోని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్న సీఎం కేసీఆర్ బురిడీ బాబాలా తయారయ్యారని మండిపడ్డారు. రాష్ట్రం సాకారమయ్యాక బంగారు తెలంగాణ గా మారుస్తానని చెప్పిన కేసీఆర్ - ఈ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ తన పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని - కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు ప్రధానంగా కేసీఆర్ కుటుంబ పాలన తాలూకు అవినీతి వివరించాలన్నారు.
కేసీఆర్ ఓ నియంతగా మారారని - ప్రజలకు అందుబాటులో లేకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని దీనిపై ప్రజలను చైతన్య పరచాలని వివరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని - టీఆర్ ఎస్ పాలనకు చరమగీతం పాడతామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సంఘటితంగా కేసీఆర్ అరాచక పాలనపై గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం - సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ - రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని అన్నారు. కేసీఆర్ పై ఆయన కూడా విమర్శలు గుప్పించారు. రాష్ట్రం రాగానే ఎస్సీని సీఎంను చేస్తానని ఆ సీటును కేసీఆర్ కబ్జా చేశారని దుయ్యబట్టారు. మొత్తానికి రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.