Begin typing your search above and press return to search.
సామాజికంగా బహిష్కరించాలట
By: Tupaki Desk | 12 Dec 2021 8:30 AM GMTరాజకీయాలు అన్నీ హద్దులను చెరిపేశాయి. ఒకపుడు నేతలు హుందాగా వ్యవహరించేవారు. కానీ ఇపుడు అలాంటి హద్దులేమీ లేకుండా వ్యక్తులనే ఎటాక్ చేస్తు రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తోంది. కేసీయార్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలని రేవంత్ పిలుపిచ్చారు. కేసీయార్ కుటుంబంలోకి పిల్లలను ఇవ్వద్దు, వారి కుటుంబంలోని పిల్లలను చేసుకోవద్దంటు రేవంత్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.
కేసీయార్ అవినీతికి పాల్పడ్డారనో లేకపోతే అక్రమాలు చేస్తున్నారనో ఆరోపించటం వరకు ఓకేనే. చేసిన ఆరోపణలకు ఆధారాలను చూపించాల్సిన బాధ్యత కూడా ఆరోపణలు చేసిన వ్యక్తులపైనే ఉంటుంది. అలాకాకుండా అమరవీరుల స్తూపాన్ని నిర్మించలేదని, తప్పుడు సర్టిఫికేట్లతో ఆంధ్రాకంపెనీ టెండర్లు పొందిందని, రు. 63 కోట్లతో పూర్తయ్యే పనిని రు. 183 కోట్లకు పెంచారని ఆరోపించారు.
తాను చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలి. లేదా కోర్టులో పిటీషన్లు వేసి ప్రభుత్వాన్ని కోర్టుకు ఈడ్చాలి. అంతేకానీ కేసీయార్ ఒంట్లో తెలంగాణా రాక్తమే ప్రవహిస్తోందా ? రక్త పరీక్షకు కేసీయార్ సిద్ధమేనా ? అని రేవంత్ మాట్లాడటాన్ని ఎవరు మెచ్చుకోరు. రేవంత్ అభిమానులతో రేవంత్ అభిమానులు రెచ్చిపోవచ్చేమో కానీ మామూలు జనాలు అంగీకరించరు. రక్తంలో తెలంగాణా రక్తమని, ఆంధ్ర రక్తమని ఉండదని రేవంత్ కు తెలీదా ? రక్తపరీక్షలో రేవంత్ ది తెలంగాణా రాక్తమే అని తెలుస్తుందా ?
తప్పుడు సర్టిఫికేట్లతో ఆంధ్రా కంపెనీ టెండర్లు పొందిందని ఆరోపించటంలో కూడా తప్పుంది. టెండర్ దక్కించుకునేందుకు తప్పుడు సర్టిఫికేట్లు పెట్టడం వరకు తప్పనే చెప్పాలి. అంతేకానీ పనులను ఆంధ్రా కంపెనీ దక్కించుకుందని చెప్పటం అభ్యంతరకరమే. ఆంధ్రా కంపెనీలు తెలంగాణాలో వర్కులు చేయకూడదని ఎక్కడైనా ఉందా ? పలానా వర్కు చేయటానికి పలానా కంపెనీకి సాంకేతికంగా, ఆర్ధకపరమైన అర్హతలున్నాయా లేదా అని మాత్రమే చూడాలి.
సాంకేతిక అంశాలు లేదా విధానపరమైన అంశాలపై మాట్లాడటం మానేసి కేసీయార్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలని పిలుపివ్వటం చాలా తప్పు. ఇలాంటి వ్యాఖ్యలు జనాలను రెచ్చగొట్టడానికి రాజకీయ కాలుష్యాన్ని పెంచటానికి మాత్రమే ఉపయోగపడతాయి. రాజకీయ నేతలు మాట్లాడేటపుడు కాస్త హుందాగాను సంయమనంతోను ఉండాలి. లేకపోతే చాలా గొడవలైపోతాయి. ఇపుడు రేవంత్ మాట్లాడినట్లే రేపు రేవంత్ గురించి మరో నేత మాట్లాడుతారు. దీని వల్ల సమాజంలో గొడవలు అవటం తప్ప ఇంకే ఉపయోగం ఉండదు.