Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై మళ్లీ పడ్డ రేవంత్ రెడ్డి

By:  Tupaki Desk   |   18 Jan 2022 10:00 AM GMT
కేసీఆర్ పై మళ్లీ పడ్డ రేవంత్ రెడ్డి
X
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి పడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లెక్కలేదని ఫైర్ అయ్యారు. అందుకే మోడీ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

తెలంగాణలో రైట్ టు ఎడ్యూకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుందని.. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటాడని రేవంత్ ఎద్దేవా చేశారు.

అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీచర్లే లేనప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువును ఎలా అందిస్తారని నిలదీశారు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలలను అన్నింటినీ మూసివేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని.. చదువును దూరం చేసి గొర్లు, బర్లు, చేపలు ఇస్తున్నారని రేవంత్ సెటైర్లు వేశారు. విద్యకు పెట్టే నిధులు కేసీఆర్ దృష్టిలో ఖర్చు.. సమాజం దృష్టిలో పెట్టుబడి అని అన్నారు.

తెలంగాణకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టే జార్జ్ రెడ్డి లాంటి లీడర్లు పుట్టారని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయని రేవంత్ ఆరోపించారు.

ఉద్యోగాల భర్తీ లేకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదని.. రైట్ టు ఎడ్యూకేషన్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తేనే పేదలు బాగుపడుతారని రేవంత్ అన్నారు. కేసీఆర్ మనువాది అంటూ విమర్శించారు.