Begin typing your search above and press return to search.

కేటీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. ఆందోళన.. అరెస్ట్.. విడుదల

By:  Tupaki Desk   |   3 March 2020 6:00 AM GMT
కేటీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు.. ఆందోళన.. అరెస్ట్.. విడుదల
X
రంగారెడ్డి జిల్లా జన్వాడ గ్రామం దగ్గర టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌ హౌస్ నిర్మించారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు నిరూపిస్తూ దాన్ని బయటపెడతానంటూ సోమవారం మీడియాను అక్కడకు తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశరాు. ఈ సందర్భంగా కేటీఆర్ అవినీతి, అక్రమాలు చేస్తున్నాడని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపిస్తూ ఆందోళనలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని, ఈ ప్రాంతం 111 జీఓ పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఈ ఆనిర్మాణం ఎలా చేపడతారని ప్రశ్నిస్తూ రేవంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పైన తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టి రేవంత్‌రెడ్డితో మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భం గా రేవంత్‌ రెడ్డి పై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదైంది. కేటీఆర్ ఫామ్ హౌస్‌ దగ్గర అనుమతి లేకుండా డ్రోన్‌ను ఉపయోగించడం తో రేవంత్‌ రెడ్డి అనుచరుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే సాయంత్రం రేవంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విడుదల అయ్యారు.