Begin typing your search above and press return to search.
తెలంగాణ ప్రాజెక్టుల్లో కేవీపీ కాలు పెడుతున్నారా?
By: Tupaki Desk | 18 Sep 2015 10:46 AM GMTకాంగ్రెసు రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావుపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేవీపీని బేతాళ మాంత్రికుడితో పోల్చారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో ఆయన వేలు పెడుతున్నారని ఆరోపించారు. కేవీపీ సలహా మేరకే తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.
''ప్రాజెక్టుల్లో కమీషన్లు ఎలా వసూలు చెయ్యాలో కేవీపీకి తెలిసినంతగా ఇంకెవరీ తెలియదు.. గతంలో ప్రాణహిత-చేవెళ్లకు డిజైన్ ఇచ్చిన వ్యాప్ కోస్ సంస్థ ఇప్పుడు ఆ డిజైన్ పనికిరాదనడంలో మర్మమేమిటో చెప్పాలి'' అంటూ కేవీపీ లక్ష్యంగా రేవంత్ ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేవీపీ సలహాలతో ప్రాజెక్టుల డిజైన్లు మార్చుతూ కొత్తగా కమీషన్లు దండుకునేందుకు సిద్ధమవుతోందని ఆయన అన్నారు.
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితిని కేసీఆరే కల్పించారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణాకు మొట్టమొదట ఎలిమినేటి మాధవరెడ్డి పేరుతో ఎత్తిపోతల పథకాన్ని తెచ్చింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. ప్రాణహిత కోసం పోరాడింది కూడా ఆయనేనని రేవంత్ రెడ్డి చెప్పారు.
మరోవైపు శంకర్ పల్లి మండలం మహలింగపురం దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను టిడిపి నేతలు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రాజెక్ట్ డిజైన్ మార్చడం దారుణమన్నారు. డిజైన్ మార్పుతో రంగారెడ్డి జిల్లా నష్టపోతుందని చెప్పారు.