Begin typing your search above and press return to search.

మోడీకి ఆ విషయం అక్కర్లేదు..అపాయింట్‌ మెంట్ కూడా ఇవ్వలేదు !

By:  Tupaki Desk   |   14 Dec 2019 9:15 AM GMT
మోడీకి ఆ విషయం అక్కర్లేదు..అపాయింట్‌ మెంట్ కూడా ఇవ్వలేదు !
X
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి ప్రధాని మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీ కి ప్రజా పాలన , ప్రజా సమస్యలపై ఎందుకు స్పదించడంలేదు అని , ఏవో కొన్ని అంశాలపై ట్విట్టర్ లో మాత్రమే స్పందిస్తారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం ఎంపీలకు అపాయింట్‌మెంట్ కూడ ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. మోడీ తీసుకున్న అనాలోచితంగా నిర్ణయమైనా నోట్ల రద్దు వికటించి దేశ ఆర్ధికపరిస్థితి తిరోగమన దిశగా వెళుతుందని , విభజించి పాలించు అనే కోణంలో వ్వవస్థలను నాశనం చేశారని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఇతర నిరుద్యోగ సమస్యల పై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లో భారత్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత సోనియా గాంధీతో పాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు , ఎంపీలు , పార్టీ కార్యకర్తలు హజరయ్యారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి తెలంగాణ నుండి సుమారు నాలుగు వేల మంది నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లారు. ఈనేపథ్యంలోనే మోడీ విధానాలపై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మోడీ ప్రజా సమస్యలని తెలుసుకొని ..దానికి తగట్టు నిర్ణయాలు తీసుకోవాలని హితవు పలికారు.

ఇక ఇదే సమయం లో రాష్ట్రం లో ఉన్న ప్రస్తుత పరిస్థితి పై కూడా మాట్లాడారు. సీఎం కేసీఆర్ దోపిడిని ఆపివేస్తేనే... రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, ఒకప్పుడు మిగులు బడ్జెట్ తో కళకళలాడిన తెలంగాణ ..ఇప్పుడు అప్పుల తెలంగాణ గా మారడానికి సీఎం కేసీఆరే కారణం అని , సీఎం రాచరిక పాలనలో రాష్ట్రం బందీ అయిందని విమర్శించారు.