Begin typing your search above and press return to search.
కేసీఆర్-హరీశ్ వి నాటకాలు...వీడియోలో అసలు కథ
By: Tupaki Desk | 13 March 2018 9:51 AM GMTతెలంగాణ అసెంబ్లీ కేంద్రంగా అధికార - ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి హెడ్ ఫోన్ విసరడం, అది మండలి చైర్మన్ కు తాకడం - అనంతరం ఆయన ఆస్పత్రిలో దీనిపై భగ్గుమన్న అధికార పక్షం కోమటిరెడ్డి సస్పెన్షన్ వేటు వేయడం తెలిసిన సంగతే. ఈ పరిణామంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో చనిపోయిన రైతుల కోసం గాని గిట్టుబాటు ధర గురించి గాని ప్రసంగంలో లేకపోవడం దారుణంగా ఉందన్నారు. రైతులకు అండగా ఉండేందుకు మాత్రమే నిరసన తెలిపామని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీఆరెస్ పార్టీ నిరసన తెలిపిందని, అప్పుడు లేనిది ఇప్పుడు ఏందుకు సస్పెన్షన్ వేటు అని ప్రశ్నించారు.
`పార్లమెంట్ లో సభ స్టార్ట్ అయిన నుండి రోజు టీఆర్ ఎస్ పార్టీ నిరసన తెలుపుతోంది. సీఎం కేసీఆర్ గారికి సూటిగా చెప్తున్నాను. మీ ఎంపీలు పార్లమెంట్ నిరసన తెలిపే హక్కు ఏవిధంగా ఉందొ అదే హక్కు మాకు ఉంది. పేపర్లు - ఛానెల్ లు దున్నపోతు ఇనినట్టు పెద్ద పెద్ద హెడ్ లైన్స్ పెట్టి చూపించారు. స్వామి గౌడ్ గారికి కన్నుకు తగిలింది అని పదే పదే చూపిస్తున్నారు కానీ అది ఎవ్వరికి తగిలిందో చూపెట్టడం లేదు ఎందుకు?. పాత్రికేయ మిత్రులు ఎందుకు అడగడం లేదు. అఖిల పక్షంను పిలిచి ఆ వీడియో ను స్పీకర్ సమక్షంలో అందరికి చూపెట్టాలి అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. మార్షల్ లు కాంగ్రెస్ సభ్యులను కొట్టారా లేక కోమటిరెడ్డి మైక్ విసిరాడా అని తేలుతుంది.` అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. `గతంలో కూడా మేము నిరసన తెలిపితే నన్ను సండ్ర వెంకట వీరయ్యను సస్పెండ్ చేశారు. ఇప్పుడు నేను సభలో లేను కాబట్టి కోమటిరెడ్డి ని సస్పెండ్ చేశారు. బీసీల వ్యతిరేక ముద్ర వేసేందుకు మాత్రమే కోమటిరెడ్డిను బలి చేశారు. ఈ మధ్యలో సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తాను అని చెప్పినందుకే ఇలా చేస్తున్నారు` అని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం మాత్రమే హాస్పిటల్ లో జాయిన్ అయ్యానని స్వామిగౌడ్ తెలిపారని ఇంతకంటే దౌర్బగ్యం ఉంటుందా అని రేవంత్ ప్రశ్నించారు. ` చంద్రశేఖర చిదంబరా రహస్యాన్ని పెద్దలు స్వామి గౌడ్ బట్ట బయలు చేశాడు. మంచోడు కాబట్టి స్వామి గౌడ్ ఈ విదంగా చెప్పాడు. మామా అల్లుళ్ళ నాటకాలకు తెరదించండి. మార్షల్స్‌కు హరీష్ రావు కను సైగ చేశాడు. అప్పుడు వారు కోమటిరెడ్డిపై దాడికి దిగారు. అందుకే కెమెరాలు పరిశీలించాలి. ఒకవేళ నిజం అని తేలితే హారిష్ రావు పక్కకు పెడుతుందా? అని రేవంత్ ప్రశ్నించారు. కోమటిరెడ్డికి - సంపత్ కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.