Begin typing your search above and press return to search.
గన్ పార్క్ ముందు నిలబెట్టి కాల్చాలి.. రేవంత్ సంచలనం
By: Tupaki Desk | 29 Aug 2019 10:09 AM GMTతెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ట్రాన్స్ కో - జెన్ కో సీఎండీని ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎండీ ప్రభాకరరావు గన్ పార్క్ ముందు నిలబెట్టి కాల్చినా తప్పులేదని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల గురించి రేవంత్ సంచలన ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు లేవని టీఆర్ ఎస్ బుకాయిస్తోందని - ఛత్తీస్ ఘఢ్ తో దీర్ఘకాలిక ఒప్పందం నష్టమని ఈఆర్ సీకి ఫిర్యాదు చేశామని, అప్పటి ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా కొనుగోళ్లను తప్పుబట్టారని చెప్పారు.
అలాగే ఛత్తీస్ గఢ్ లో విద్యుత్ కొనుగోళ్ల వెనక అదాని హస్తం ఉందని - తెర వెనక అదాని - తెర ముందు ఛత్తీస్ ఘఢ్ ప్రభుత్వం ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఇక తెలంగాణ ట్రాన్స్ కో - జెన్ కో సీఎండీ ప్రభాకరరావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని - ఆయనను గన్ పార్క్ ముందు నిలబెట్టి కాల్చినా తప్పులేదని తీవ్ర స్వరంతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో వాడేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతిచ్చిందని, అదంతా కూడా ఇండియా బుల్స్ ను బతికించేందుకేనని అన్నారు.
కాలుష్యం - నిర్మాణ ఖర్చులు ఎక్కువయ్యే కాలం చెల్లిన టెక్నాలజీని భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కు వాడారన్నారు. దీని వల్ల ప్రజలపై ₹7,500 కోట్ల భారం పడిందన్నారు. ప్లాంట్ ను 2017 నాటికే పూర్తి చేస్తామని చెప్పారని - రెండేళ్లు దాటినా ఒక్క యూనిట్ కరెంట్ కూడా తయారు చేయలేదని మండిపడ్డారు.
యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు రూ. 32 వేల కోట్ల పనులకు నామినేషన్ పద్ధతిలో బీహెచ్ ఈఎల్ కు కాంట్రాక్ట్ ఇప్పించి - ఆ కంపెనీ నుంచి కేసీఆర్ తన బంధువులకు పనులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. దానికి కేసీఆర్ కు భారీగా కమీషన్లు ఇచ్చారని - అందుకు జెన్ క -, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్రావు సంతకాలు చేశారని ఆరోపించారు.
నామినేషన్ పద్ధతిలో పనులు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి రు. 6 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. రేవంత్ బీజేపీ నేతలపై కూడా విమర్శలు చేశారు. కేసీఆర్ అవినీతిపై తాము ఫిర్యాదు చేస్తామని.. విచారణ జరిపించడానికి బీజేపీ నేతలు లక్ష్మణ్ - నడ్డా - కిషన్ రెడ్డి సిద్ధమా? అని రేవంత్ సవాల్ చేశారు. తన ఆరోపణలు తప్పైతే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు. టీఆర్ ఎస్ - బీజేపీ డ్రామాలు ఆపాలని - సీబీఐ విచారణకు బీజేపీని అడ్డుకుంటుందెవరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.